Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అధికారిక లాంఛనాలతో గద్దర్‌ అంత్యక్రియలు, మహాబోధి స్కూల్‌లో: పవన్ కన్నీరు, ఎన్టీఆర్ ఇలా

హైదరాబాద్: తన జీవితకాలం ప్రజల కోసమే బతికిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్‌.. తెలంగాణ గర్వించే బిడ్డ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు తెలిపారు. జీవితాంతం ప్ర‌జ‌ల కోసం ఆయ‌న చేసిన త్యాగాలు, ప్రజాసేవకు గౌరవ సూచకంగా దివంగత గద్దర్‌ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

ఈ మేరకు గద్దర్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడి అందుకు త‌గిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. గద్దర్ మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటని అన్నారు.

Telangana cm kcr ordered to official cremation for gaddar last rights

మహాబోధి పాఠశాలలోనే గద్దర్ అంత్యక్రియలు

ప్రజా గాయకుడు గద్దర్ పార్థీవదేహాన్ని ప్రజల సందర్శార్థం ఎల్బీ స్టేడియంలో ఉంచిన విషయం తెలిసిందే. పలువురు రాజకీయ నాయకులు, ఉద్యమ సంఘాల నాయకులు, సీనియర్ పాత్రికేయులు, కళాకారులు, భారీ ఎత్తున ప్రజలు.. గద్దర్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సోమవారం ఉదయం వరకు ఆయన భౌతికకాయాన్ని ఎల్బీ స్టేడియంలోనే ప్రజల సందర్శనార్థం ఉంచనున్నట్లు గద్దర్ కుటుంబసభ్యులు తెలిపారు.

పేద విద్యార్థుల కోసం సికింద్రాబాద్ అల్వాల్‌లో మహాబోధి పాఠశాలను నెలకొల్పారు. నర్సరీ నుంచి పదో తరగతి వరకు పేద విద్యార్థులకు విద్యనందించాలనే లక్ష్యంతో ఆయన ఈ పాఠశాలను ఏర్పాటు చేశారని సిబ్బంది తెలిపారు. గద్దర్ మరణ వార్త విని మహాబోధి సిబ్బంది భావోద్వేగానికి గురయ్యారు.

గద్దర్‌కు అత్యంత ఇష్టమైన మహాబోధి పాఠశాల ప్రాంగణంలో అంత్యక్రియలు నిర్వహించాలని గద్దర్ కుటుంబసభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను మేడ్చల్ డీసీపీ శబరీష్ పరిశీలించారు. సోమవారం ఉదయం 11 గంటల వరకు ఎల్బీ స్టేడియంలో గద్దర్ పార్థీవ దేహాన్ని ఉంచనున్నారు. ఆ తర్వాత గద్దర్ ఇంటికి తరలించి.. ఆ తర్వాత అక్కడ్నుంచి మహాబోధి పాఠశాలకు ఆయన పార్థీవదేహాన్ని తరలిస్తారు. అక్కడే మధ్యాహ్నం అంత్యక్రియలు జరగనున్నాయి.

గద్దర్ పార్థీవదేహానికి నివాళుర్పించిన పవన్ కళ్యాణ్: కంటతడి

ఎల్బీ స్టేడియంలో ఉన్న గద్దర్ పార్థీవదేహానికి జనసేన, ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్ నివాళుర్పించారు. అనంతరం వపన్.. గద్దర్ కుటుంబసభ్యులతో మాట్లాడారు. వారిని ఓదార్చారు. గద్దర్ కుమారుడిని ఓదారుస్తూ పవన్ కళ్యాణ్ కూడా కన్నీటిపర్యంతమయ్యారు.

గద్దర్ ఆట, మాట, పాట ఎప్పటికీ సజీవం: ఎన్టీఆర్

గద్దర్ రచనలతో కొన్ని దశాబ్దాలుగా ప్రజల గుండెల్లో స్ఫూర్తిని నింపారని ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. 'ప్రజా గాయకుడు గద్దర్ మన మధ్యన లేకున్నా.. ఆయన ఆట, మాట, పాట ఎప్పటికీ మన మధ్యన సజీవంగానే ఉంటాయి. గద్దర్ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అని ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+