వరంగల్లోనే, కన్నీళ్లొచ్చాయ్: కేసీఆర్, కెకెతో ఘర్షణ
వరంగల్: ఎవరికీ లొంగని, ఏ విషయంలోను రాజీపడని వ్యక్తులు వరంగల్ జిల్లాలో ఎక్కువగా ఉంటారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం అన్నారు. వరంగల్ నిట్ ఆడిటోరియంలో కాళోజీ సంస్మరణ సభ జరిగింది. కాళోజీ చిత్రపటానికి కేసీఆర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కాళోజీ చిత్రపటాన్ని గీసిన మనోహర్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు.
కాళోజీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అన్నారు. కాళోజీ కేవలం వరంగల్‌కో, తెలంగాణకో, భారత్‌కో చెందిన వ్యక్తి కాదన్నారు. ఆయన ప్రపంచానికి చెందిన వ్యక్తి అన్నారు. కాళోజీ విశ్వకవి, విశ్వమానవుడు అన్నారు. ఆయన గురించి ఎంత పొగుడుకున్నా తక్కువే అన్నారు. ఎవరికీ లొంగని, ఏ విషయంలోను రాజీపడని వ్యక్తులు వరంగల్ జిల్లాలో ఎక్కువగా ఉంటారని అన్నారు. కాళోజీ ఏ విషయంలోను ఎప్పుడు రాజీపడలేదన్నారు.
పరాయి పాలనలో మనం చాలా బాధలు పడ్డామని, కాళోజీ గురించి కూడా చెప్పుకునే లేకుండెనన్నారు. హైదరాబాదులోని రవీంద్ర భారతిని తలదన్నేలా వరంగల్ జిల్లాలో కాళోజీ కళాక్షేత్రం ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం రూ.12 కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. కాళోజీ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. కాళోజీ సహచర్యంతో ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. కాళోజీ ఫౌండేషన్‌కు రూ.10 లక్షలు ఇస్తామన్నారు.

తెలంగాణ వచ్చినందుకు ఈ రోజు జయశంకర్, కాళోజీలు జీవించి ఉంటే ఎంతో సంతోషించే వారన్నారు. ఆంధ్రా వారు తమ పొట్టి వారిని పొడుగువారిగా చూపించారన్నారు. మన దాశరథిని, పాల్కురికి సోమనాథుని, కాళోజీ వంటి వారిని ఆంధ్రా పాలకులు పట్టించుకోలేదన్నారు. కాళోజీ ఏదైనా ఉంటే ముఖం మీదనే చెప్పేవారన్నారు. తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి రోజును ప్రకటిస్తామన్నారు. కాళోజీ పేరిట ఓ విశ్వవిద్యాలయం ముందు ముందు పెడతామన్నారు.
కేకేకు, నాకు మధ్య పంచాయతీ
కేకేకు నాకు మధ్య ఉదయం పంచాయతీ జరిగిందన్నారు. పంచాయతీ అంటే నిజమైన పంచాయతీ కాదని, వాదన అన్నారు. ఓ ఇనిస్టిట్యూట్‌కు వందల ఎకరాలు, ఆసుపత్రికి కూడా వందల ఎకరాల భూమి ఉంటుందని, వంరగల్ కలెక్టరేట్‌కు 25 ఎకరాలు ఉందని, ఇంత అవసరమా అని కేసీఆర్ ప్రశ్నించారు.
ఫుట్‌పాత్ పైన రోజుకు నాలుగు లక్షల మంది పడుకుంటారని విని తాను, కన్నీళ్లు పెట్టుకున్నానని, ఇలాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రినా అని ఆవేదన చెందానన్నారు. పేదలకు 50 గజాల ఇళ్లు సమకూర్చని ప్రభుత్వాలు ఎందుకన్నారు.
ఇప్పటి వరకు ఏం చేయలేదు
ఇప్పటి వరకు తాము ఏమీ చేయలేదని, ఇక ముందు చేసి చూపిస్తామని కేసీఆర్ అన్నారు. తమ వంద రోజుల పాలన పైన పొన్నాల నిత్యం విమర్శలు గుప్పించడం విడ్డూరమన్నారు. భూమిలేని దళితులకు భూమి ఇస్తామని, లక్ష కుటుంబాలకు ఇవ్వాలన్నారు. మనం కూడా ఇప్పుడే పొగడుకోవడం కాదని, లక్ష కుటుంబాలకు భూమి ఇచ్చాక పొగుడుకుందామన్నారు. చేయని దానిని చేసినట్లు, చిన్న దానిని పెద్దగా చెప్పడం తనకు ఇష్టముండదన్నారు.
చేస్తేనే చెబుతానని అన్నారు. తన కేబినెట్లోని మంత్రులు కూడా అలాగే ఉండాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి రాజయ్యకు హితవు పలికారు. ఉద్యమంలో ఎలా చిచ్చర పిడుగులా పని చేశామో.. తెలంగాణ పునర్నిర్మాణంలోను అలాగే పని చేస్తామన్నారు. తాను ఇతర పార్టీలలో అబద్దాలు ఆడనని చెప్పారు. తాను ఎన్నికల ప్రచారం సమయంలో విద్యుత్ సమస్య గురించి ముందే చెప్పానని, మూడేళ్ల తర్వాత విద్యుత్ ఇరవై నాలుగు గంటలు ఇస్తామన్నారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications