Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేసీఆర్ దేశానికి ఆదర్శం, ఆ చట్టాలతో దేశంలో రైతులండరు: ఆర్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రముఖ సీనినటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్ నారాయణ మూర్తి ప్రశంసల వర్షం కురిపించారు. రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఆర్ నారాయణ మూర్తి నటించిన రైతన్న సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా మంత్రుల నివాస సముదాయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రైతన్న చిత్రాన్ని ఆదరించండి..

రైతన్న చిత్రాన్ని ఆదరించండి..

గత 36 ఏళ్లుగా దేశంలోని సమస్యల మీద కవులు, కళాకారులు, మీడియా స్పందించినట్లు మాదిరిగా సినిమా మాద్యమం ద్వారా తాను స్పందిస్తున్నట్లు ఆర్ నారాయణమూర్తి తెలిపారు. అర్ధరాత్రి స్వాతంత్ర్యం నుంచి అన్నదాత సుఖీభవ వరకు 36 సినిమాలు తీసినట్లు తెలిపారు. ప్రస్తుతం తాను స్వీయ దర్శకత్వంలో రూపొందిన 'రైతన్న' సినిమా ఆగస్టు 14న విడుదల కాబోతుందని తెలిపారు నారాయణ మూర్తి.

అందరూ ఈ చిత్రాన్ని ఆదరించాలన్నారు.

ఆ చట్టాలతో దేశంలో రైతులండరంటూ ఆర్ నారాయణమూర్తి..

ఆ చట్టాలతో దేశంలో రైతులండరంటూ ఆర్ నారాయణమూర్తి..

కేంద్రప్రభుత్వం తీసుకువస్తున్న నూతన వ్యవసాయ చట్టాలు, కరెంటు చట్టాలు రైతులకు వరాలు కావన్నారు. అవి శాపాలుగా మారబోతున్నాయని తెలిపారు. గత ఎనిమిది నెలలుగా కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఓవైపు కరోనా విపత్తులో ప్రపంచం వణికిపోతుంటే రైతాంగం మాత్రం ధైర్యంగా వ్యవసాయం చేసి ఆహారం అందించింది.

ఇలాంటి చట్టాలు వర్ధమాన దేశమైన భారతదేశానికి మంచివి కావని ఆర్ నారాయణమూర్తి తెలిపారు. ఇటీవల బీహార్‏లో మార్కెట్లు ఎత్తేస్తే గిట్టుబాటు ధర దక్కక రైతులు విలవిలలాడుతున్నారు. స్వేచ్చా వాణిజ్యం పేరుతో రైతుల మెడకు ఉరి బిగించడం తగదని ఆర్ నారయణ మూర్తి వ్యాఖ్యానించారు. బీహార్‏లో ఇప్పుడు రైతులు లేరు.. కేవలం రైతు కూలీలే మిగిలారు. కొత్త వ్యవసాయ చట్టాలు అమలైతే దేశంలో కూడా రైతు కూలీలే మిగులుతారు. కేంద్రం కొత్త చట్టాలను పక్కకు పెట్టి స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని ఆర్ నారాయణ మూర్తి డిమాండ్ చేశారు.

ఆర్ నారాయణమూర్తి రైతన్న సినిమా అద్భుతమంటూ నిరంజన్ రెడ్డి

ఆర్ నారాయణమూర్తి రైతన్న సినిమా అద్భుతమంటూ నిరంజన్ రెడ్డి

కాగా, ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై మాట్లాడారు. రైతన్న సినిమాను అందరూ ఆదరించాలని కోరారు. సమాజ హితం కోసం అనేక మాద్యమాల ద్వారా పలువురు కృషి చేస్తుంటారు. సినిమా మాద్యమం ద్వారా ప్రజల పక్షపాతి, రైతు పక్షపాతి, తెలుగు ప్రజలకు సుపరిచితుడు ఆర్ నారాయణ మూర్తి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఈ సినిమాను నిర్మించారని నిరంజన్ రెడ్డి తెలిపారు.

ఈ సినిమాలో మట్టికి, మనిషికి ఉన్న సంబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించారని మంత్రి ప్రశంసించారు. రైతులు, ప్రజలు, మీడియాతోపాటు సమాజంలోని అందరూ ఈ సినిమాను చూడాలని మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. ప్రజల హితాన్ని కోరే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. వ్యాపార విలువలే ప్రధానంగా ఉన్న పరిస్థితులలో ప్రజల కోసం, రైతుల హితం కాంక్షిస్తూ వస్తున్న ప్రభోధాత్మక సినిమా ఇది. ప్రజా ప్రయోజనం జరిగే కృషి ఏ రంగంలో జరిగినా మనం స్వాగతించాలి. ఒక శ్యాం బెనగల్, ఒక మృణాల్ సేన్ మాదిరిగా తెలుగులో నారాయణమూర్తి సినిమాలను తీస్తున్నారు.

ఆగస్టు 14న విడుదలవుతున్న రైతన్న సినిమాను ఆదరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కేంద్రం తీసుకునే నిర్ణయాలు ప్రజలకు ఇబ్బంది కలిగించేవి అయినప్పడు స్పందించాల్సిన విపక్షాలు విస్మరిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలు తమకు వ్యతిరేకమని ప్రజలు ఒకసారి భావిస్తే వారే విపక్షపాత్ర పోషిస్తారు. అంశాలవారీగా హేతుబద్దతతో కూడిన విమర్శలను సమాజంలో అందరూ స్వాగతించాల్సిందే. కానీ, ప్రస్తుత రాజకీయాలలో దురదృష్టవశాత్తు విమర్శ అంటే కువిమర్శ, తిట్లు, సంస్కారహీనత, రెచ్చగొట్టడం విమర్శలుగా మారాయన్నారు. ఈ ధోరణి మంచిది కాదని మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు

చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు

కాగా, కేంద్ర ప్రభుత్వం కొత్తగా మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు సంవత్సర కాలంగా పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రైతులు దేశ రాజధాని సరిహద్దులో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలపింది.

అయితే, ఈ ర్యాలీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. వందల సంఖ్యలో పోలీసులు వ్యసాయ సంఘాల నేతల దాడుల్లో గాయపడ్డారు. ఓ ట్రాక్టర్ తిరగబడి ఓ రైతు కూడా మరణించాడు. సంఘ విద్రోహక శక్తులు చేరడం వల్లే ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిందని రైతు నేతలు చెప్పారు. ఆ తర్వాత రైతు సంఘాల నేతలు తమ నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు.

తాజాగా, జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు కూడా చేశారు. వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం పలు మార్లు చర్చలు జరిపినప్పటికీ.. అవి సఫలం కాలేదు. మరోసారి చర్చలు జరిపేందుకు కూడా తాము సిద్ధమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రైతులకు మేలు చేసే వ్యవసాయ చట్టాలను అడ్డుకోవడం సరికాదని కేంద్రం అంటోంది. పంటల మద్దతు ధరను కొనసాగిస్తామని, కొనుగోలు కేంద్రాలు కొనసాగుతాయని కేంద్రం చెబుతోంది.

రైతు సంఘాల నేతలు, కాంగ్రెస్, సహా ప్రతిపక్షాలు మాత్రం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని పట్టుబడుతున్నాయి. అవసరమైతే ఒక ఏడాది వాయిదా వేస్తాం కానీ, వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం కుదరదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తేల్చి చెప్పింది. రైతులను రైతు సంఘాల నేతలు, రాజకీయ పార్టీల నేతలు స్వప్రయోజనాల కోసం తప్పుదోవ పట్టిస్తున్నారని, రైతులకు మేలు చేసే చట్టాలను అడ్డుకుంటున్నారని విమర్శిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+