వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ కేబినెట్ లోకి కవిత ఎంట్రీ- ముహూర్తం ఖరారు..!! తాజా పదవులు-పక్కాగా లెక్కలు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

కొంత కాలంగా సీఎం కేసీఆర్ కుమార్తె కేబినెట్ లోకి ఎంట్రీ ఇస్తారంటూ ప్రచారం సాగుతోంది. కానీ, ఇప్పుడు అది నిజం అయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో ఎంపీగా కవిత ఓడిపోయిన తరువాత ఎమ్మెల్సీగా పెద్దల సభకు పంపారు. కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలు..జాతీయ రాజకీయాలను పక్కగా అంచనా వేస్తున్న కేసీఆర్ ఈ మధ్య కాలంలో ఢిల్లీలో వారం రోజులు మకాం వేసారు. ఇక, తెలంగాణలోనూ అంచనాలకు అందని విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక కోణంలో నిర్ణయాలు కనిపిస్తున్నా..వీటి వెనుక భారీ వ్యూహమే ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా.. త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్దం అవుతోందని విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వం పైన వస్తున్న ప్రతీ విమర్శకు చర్యలు..నిర్ణయాల ద్వారా కేసీఆర్ ప్రభుత్వం సమాధానం చెబుతోంది. ఇప్పటికే తనయుడు కేటీఆర్ మంత్రిగా..పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సక్సెస్ రూట్ లో ఉన్నారు. ఇక, కుమార్తెను సైతం మంచి అవకాశం ఇవ్వటం ద్వారా సక్సెస్ అయ్యేందుకు రూట్ క్లియర్ చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

Telangana CM KCRs daughter Kavitha to be induced into cabinet soon,thus ending the long wait

అందులో భాగంగా..తాజాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన బాజిరెడ్డి గోవర్ధన్ కు తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్ పదవి కట్టబెట్టారు. ఇతర నామినేటెడ్ పోస్టులు ఏవీ ప్రకటించకుండా.. కేవలం నిజామాబాద్ జిల్లాకు చెందిన బాజిరెడ్డి గోవర్ధన్ కు ఈ పదవి కట్టబెట్టటం వెనుక అసలు కారణం పైన పార్టీలో చర్చ మొదలైంది. జిల్లాలో బాజిరెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సీనియర్ గా ఉన్నారు. జిల్లా నుంచి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న కవితకు తరువాత మంత్రి పదవి ఇచ్చే క్రమంలోనే బాజిరెడ్డికి నామనేటెడ్ పదవి ఇచ్చారనే చర్చ పార్టీలో నడుస్తోంది.

హుజూరాబాద్ ఉప ఎన్నిక ముగిసిన వెంటనే తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ ఖాయమని చెబుతున్నారు. ఆ సమయంలో కవితను కేబినెట్ లోకి తీసుకుంటారని పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే, ఏ నిర్ణయం తీసుకున్నా..సామాజిక సమీకరణాలను పరిగణలోకీ తీసుకోవాల్సిన పరిస్థితి అనివార్యం కావటంతో.. మంత్రివర్గంలో ప్రక్షాళన సైతం ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, గతం కంటే వేగంగా..భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్ రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

అదే విధంగా తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు ప్రారంభించారు. ఈ పధకం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారు. ఇదే సమయంలో తన కార్యాలయంలో దళిత అధికారులు లేరనే విమర్శలకు..రాహుల్ బొజ్జా నియామకంతో ముగింపు పలికారు. ఇక, తన కేబినెట్ లో మాదిగ వర్గానికి చెందిన వారికి సీఎం అవకాశం కల్పించాల్సి ఉంది. దీంతో..త్వరలోనే మంత్రివర్గ విస్తరణ పైనా సీఎం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం సాగుతోంది. అయితే, ఎప్పుడు విస్తరణ జరిగినా ఈ సారి కవిత మంత్రివర్గంలోకి ఎంట్రీ ఇవ్వటం మాత్రం పక్కా అని పార్టీ నేతలు బలంగా చెబుతున్నారు.

English summary
News roaming that MLC Kavitha may get ministry in KCR cabinet shortly. KCR taking quick decisions politically.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X