తెలంగాణ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు: పదోన్నతులు, జీతాల పెంపు
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు తీపికబురు చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. సంక్రాంతికి కొద్ది రోజుల ముందే పండగ తీసుకొచ్చారు. నూతన సంవత్సర కానుకగా వేతనాలు, పదవీ విరమణ వయస్సును పెంచుతామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా పదోన్నతుల విషయంలోనూ ఉద్యోగులకు శుభవార్త అందించారు.
పదోన్నతుల కోసం ఉద్యోగుల కనీస సర్వీసును మూడేళ్ల నుంచి రెండేళ్లకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉద్యోగుల పదోన్నతుల దస్త్రంపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. అన్ని శాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుంచి ఉద్యోగా నియామకాల ప్రక్రియను చేపడుతామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు, తక్కువ వేతనాలున్న ఆర్టీసీ సిబ్బందికి, ఒప్పంద, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు, గ్రాంట్-ఇన్-ఎయిడ్, వర్క్ ఛార్జ్‌డ్ ఉద్యోగులకు, దినవేతన, పూర్తిస్థాయి కాంటింజెంట్, పర్ట్ టైం కాంటింజెంట్, సెర్ఫ్ ఉద్యోగులకు పెంపు వర్తిస్తుందని చెప్పారు.
హోంగార్డులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, విద్యా వాలంటీర్ల మాదిరి గౌరవ వేతనాలు అందుకుంటున్న వారందరికీ, పెన్షనర్లకు.. ఇలా అందరికీ పెంపుదల ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులూ కలిసి 9,36,976 మంది ఉంటారని, అందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని తెలిపిన విషయం తెలిసిందే.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications