మహాధర్నాలో కేసీఆర్ హెచ్చరికలు- ఇది ఆరంభమే -గ్రామాల్లోనూ పోరు-ఉత్తరాది రైతులకూ మద్దతు
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్.. మంత్రులు, టీఆర్ఎస్ నేతలతో కలిసి హైదరాబాద్ ధర్నా చౌక్ లో చేపట్టిన నిరసన ఇవాళ ప్రారంభమైంది. వరి కొనుగోళ్లపై కేంద్రం దిగొచ్చేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని కేసీఆర్ హెచ్చరించారు.
ధర్నాచౌక్ లో మహాధర్నా ప్రారంభం సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ యుద్ధం ఇవాళ్టితో ముగిసేది కాదన్నారు. ఇది ఆరంభం మాత్రమే అంతం కాదన్నారు. మన హక్కులు సాధించేవరకూ , రైతాంగం ప్రయోజనాలు పరిరక్షించేవరకూ కొనసాగుతుందని రైతులతు తెలిపారు. ఉత్తర భారతంలో రైతుల ఆందోలనను కూడా కలుపుకుని పోరాటం కొనసాగిస్తామని కేసీఆర్ హెచ్చరించారు.

తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి ఢిల్లీకి అనేక పర్యటనలు చేసి తెలంగాణ గోసను కేంద్రానికి వినిపించారని, పంజాబ్ రైతుల తరహాలోనే మా ధాన్యం కూడా కొనాలని కోరారని కేసీఆర్ గుర్తుచేసారు. కేంద్ర వ్యవసాయ మంత్రిని కలిసి తాను కూడా కలిశానన్నారు. ఇది జరిగి 50 రోజులు ముగిసినా ఇంత వరకూ కేంద్రం స్పందన లేదన్నారు. దీంతో నిన్న ప్రధానికి లేఖ కూడా రాసినట్లు కేసీఆర్ వెల్లడించారు.
మన బాధ, గోస ప్రపంచానికి తెలిపేందుకే ఈ ధర్నా చేపట్టానని కేసీఆర్ తెలిపారు. ఇది ఆరంభం మాత్రమేనన్నారు. తెలంగాణ గ్రామాల్లో వివిధ రకాల పోరాట రూపాల్ని ఎంచుకుని కేంద్రం న్యాయం చేసే వరకూ పోరాటం కొనసాగించాలని టీఅర్ఎస్ శ్రేణులకూ, రైతులకూ ఆయన పిలుపునిచ్చారు. అందుకే ధర్నాను రాజధాని హైదరాబాద్ లో ప్రారంభించామన్నారు. ఇది ఉధృతమై కేంద్రంలో పెద్దల్ని కదిలిస్తుందని భావిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. వర్షం పడినా ధర్నా మాత్రం కొనసాగుతుందని కేసీఆర్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications