Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పోడు భూముల పంపిణీపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన: దాడులు చేస్తే అంటూ హెచ్చరిక

పోడు భూములపై తమకు ప్రత్యేక విధానం ఉందని, వాటిని పంపిణీ చేశాక రైతుబంధు, విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఈ నెల చివరి నాటికి పోడు భూములు పంపిణీ చేస్తామన్నారు.

హైదరాబాద్: పోడు భూములపై తమకు ప్రత్యేక విధానం ఉందని, వాటిని పంపిణీ చేశాక రైతుబంధు, విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనసభలో శుక్రవారం కేసీఆర్ మాట్లాడారు. పోడు, అటవీ భూములు కొందరికి ఆటవస్తువుల్లా తయారయ్యాయన్నారు. విచక్షణారహితంగా అడవులను నరికివేయడం సరికాదన్నారు.

11.5 లక్షల పోడు భూములు పంపిణీ చేస్తామన్న కేసీఆర్

11.5 లక్షల పోడు భూములు పంపిణీ చేస్తామన్న కేసీఆర్

రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల అటవీ భమూలు ఉన్నాయని తెలిపారు. అటవీ భూములపై ఇప్పటికే నివేదికలు సిద్ధమయ్యాయని, అన్ని పార్టీలు ఒప్పుకుంటే 11.5 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. గుత్తికోయలను తీసుకువచ్చి అడవులను నరికివేయిస్తున్నారని మండిపడ్డారు. అటవీ అధికారులపై దాడులు సరికాదన్నారు. గిరిజనులకు గత పాలకులు చేసిన మోసాలు అందరికీ తెలుసని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ఉన్నత కులాలవారు అటవీ భూములు కబ్జా చేశారన్న కేసీఆర్

ఉన్నత కులాలవారు అటవీ భూములు కబ్జా చేశారన్న కేసీఆర్

పోడు భూములపై ప్రతిసారి రాజకీయం చేయడం సరికాదన్నారు కేసీఆర్. పోడు భూములు అనేవి హక్కు కాదు.. దురాక్రమణ అని కేసీఆర్ స్పష్టం చేశారు. విచక్షణారహితంగా అడవులను నరికివేయడం సరికాదన్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రపంచ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయన్నారు. గిరిజనులపై దౌర్జన్యం జరగకుండా జరగకుండా చూడాలని సూచించారు. ఖమ్మం జిల్లాలో పలువురు ఉన్నత కులాలవారు అటవీ భూములను కబ్జా చేశారన్నారు. 10, 12 ఎకరాల పోడు భూములు ఎవరికైనా ఉంటాయా? అని కేసీఆర్ ప్రశ్నించారు.

నర్సాపూర్ అడవి ఎలా ఎడారైందంటూ కేసీఆర్

నర్సాపూర్ అడవి ఎలా ఎడారైందంటూ కేసీఆర్

గిరిజనుల హక్కులు కాపాడాల్సిందేనని, అందులో ఎలాంటి సందేహం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. పోడు భూముల దురాక్రమణ జరుగుతున్నదని అన్నారు. రాష్ట్రంలో అటవీ సంపద ఉండాలా? కనుమరుగు కావాలా? అని కేసీఆర్ ప్రశ్నించారు. నర్సాపూర్ అడవి ఎలా ఎడారైందో మనమంతా చూశామని తెలిపారు. అడవుల పునరుజ్జీవనం చేసే ప్రక్రియ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో 7.8 శాతం గ్రీన్ కవర్ పెరిగిందని వివరించారు.

ఈ నెలాఖరులోగా పోడు భూములు పంపిణీ చేస్తామన్న కేసీఆర్

ఈ నెలాఖరులోగా పోడు భూములు పంపిణీ చేస్తామన్న కేసీఆర్

పోడు భూముల విషయంలో తమకు స్పష్టత ఉందని, వీటి సర్వే పూర్తయిందని చెప్పారు కేసీఆర్. ఫిబ్రవరి నెలాఖరులోగా పోడు భూముల పంపిణీ ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. పంపిణీ చేశాక రైతుబంధు, విద్యుత్, సాగునీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఇప్పుడు సాగు చేసుకుంటున్నవారికి పట్టాలు ఇస్తామన్నారు. అయితే, భూములు తీసుకున్న గిరిజనులు ఇక నుంచి పోడు భూములను రక్షిస్తామని హామీ ఇవ్వాలన్నారు. చెట్లు నరకబోమని సంతకాలు పెడితేనే భూములు పంచుతామని స్పష్టం చేశారు. తీర్మానానికి ముందుకు రాని గ్రామాలకు పట్టాలిచ్చేది లేదని తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్. భూముల పంపిణీ పూర్తయ్యాక అటవీ ప్రాంతాలను ఆక్రమిస్తే ఊరుకునేది లేదని, పట్టాలను రద్దు చేస్తామని హెచ్చరించారు. భూమిలేని గిరిజన బిడ్డలకు దళితబంధు తరహాలోనే గిరిజన బంధు ఇచ్చి సాయమందిస్తామన్నారు.

దాడులు సహించబోమంటూ కేసీఆర్ హెచ్చరిక

దాడులు సహించబోమంటూ కేసీఆర్ హెచ్చరిక

గిరిజనులపై పోలీసులు, అటవీ శాఖ అధికారులు దాడి చేయవద్దని సీఎం కేసీఆర్ సూచించారు. అదే సమయంలో అధికారులపైనా గిరిజనుల దాడులను సహించబోమని హెచ్చరించారు. గుత్తికోయల గూండాగిరి మంచిది కాదన్నారు. అడవుల రక్షణ అనేది మనందరి బాధ్యత అని కేసీఆర్ స్పష్టం చేశారు. వాల్మీకిబోయలు, బేదర్, కిరాతక, నిషాధి, పెద్దబోయలు, తలయారి, చుండువాళ్లు, ఖాయితి లంబాడ, భాట్ మధురాలు, చమర్ మధురాలను ఎస్టీ జాబితాలో చేర్చాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+