రేపు తెలంగాణ కేబినెట్ భేటీ... ఆ రెండు అంశాలే ప్రధాన ఎజెండా..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు సాయంత్రం 4గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. కొత్త రెవెన్యూ చట్టం,బడ్జెట్ సమావేశాలపై భేటీలో చర్చించబోతున్నారు. బడ్జెట్ సమావేశాల తేదీలను రేపటి భేటీలో ఖరారు చేయడంతో పాటు కొత్త రెవెన్యూ చట్టంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

తెలంగాణకు సంబంధించిన కేటాయింపులు, ప్రాజెక్టులు,జీఎస్టీ బకాయిల విషయంలో కేంద్రం చూపిస్తోన్న వివక్షపై కూడా భేటీలో చర్చిస్తారు. ఇదిలా ఉంటే,రెండు మూడు రోజుల్లో కేసీఆర్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ప్రధానితో పాటు పలువురు కేంద్రమంత్రులను ఆయన కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిలు, ప్రాజెక్టులు,నిధుల గురించి వారితో చర్చించనున్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications