వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో పౌరులకు ప్రత్యేక ఐడీ కార్డులు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలోని పౌరులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా తెలంగాణలోని పౌరులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్ణయించారు. తెలంగాణలోని పేదలందరికీ ఆహార భద్రత చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్ర కుటుంబ ఆహార భద్రత కార్డులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణ స్టేట్ ఫ్యామిలీ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ కోసం ఈనెల 15లోగా గ్రామ రెవెన్యూ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. పథకం కింద ప్రతి వ్యక్తికీ ఐదుకిలోల బియ్యం అందిస్తారు. ఈ నెల 15లోగా వ్యవసాయ రుణమాఫీ పథకాన్ని నూరుశాతం అమలు చేయాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు.

రుణమాఫీ కోసం ప్రభుత్వం మంజూరు చేసిన 4250 కోట్ల రూపాయలు బ్యాంకులకు చేరాయని, ఆ మేరకు రైతులకు బ్యాంకులు తిరిగి రుణాలు చెల్లించే విధంగా పర్యవేక్షణ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో విద్యార్థులకు కొత్తగా ఆదాయ, కుల, నివాస ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. పెంచిన పెన్షన్ సొమ్ము నవంబర్ నుంచి అందించాలని నిర్ణయించారు.

 రివ్యూ

రివ్యూ

సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి వివిధ శాఖల కార్యదర్శులు, జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడం వల్ల తెలంగాణ రాష్ట్రం పేరిట విద్యార్థులకు కావలసిన సర్ట్ఫికెట్లు అన్నీ ఒకేసారి ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

 రివ్యూ

రివ్యూ

తెలంగాణ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ఫాస్ట్ పథకంలో లబ్ది పొందదలిచిన వారు ఈ నెల 15లోగా సర్ట్ఫికెట్ల కోసం తహసిల్దారు (ఎంఆర్‌ఓ) కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. తహసిల్దారులు ఆ దరఖాస్తులను పరిశీలించి నెలాఖరులోగా సర్ట్ఫికెట్లు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్లు పెంచామని, నవంబర్ నుంచి అందించాలని ఆదేశించారు.

 రివ్యూ

రివ్యూ

పెన్షన్లు కావలసినవారు తమ దరఖాస్తులను అక్టోబర్ 15లోగా గ్రామ రెవెన్యూ అధికారికి అందించాలని కోరారు. తెల్లకాగితంపై పూర్తి వివరాలతో దరఖాస్తు చేస్తే సరిపోతుందని తెలిపారు.

 రివ్యూ

రివ్యూ

గ్రామ రెవెన్యూ అధికారి తన వద్దకు వచ్చిన దరఖాస్తులు అన్నీ తహసిల్దారు కార్యాలయానికి అందజేయాలని తెలిపారు. పెన్షన్ మంజూరైన వారందరికీ ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా సాంక్షన్ లెటర్ రాయాలని నిర్ణయించినట్టు కేసీఆర్ తెలిపారు.

 రివ్యూ

రివ్యూ

వికలాంగులకు సదరం సర్ట్ఫికెట్లు మంజూరు చేయడం కోసం ఏరియా ఆసుపత్రుల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రుణమాఫీకై 4250 కోట్ల రూపాయలు ఇప్పటికే బ్యాంకులకు అందాయని తెలిపారు. రైతులు కొత్తగా రుణాలు పొందేందుకు మార్గం సుగమమైందని అన్నారు. ప్రతి రోజూ బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి ప్రతి రైతు కొత్తగా రుణం పొందేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశించారు.

 రివ్యూ

రివ్యూ

తెలంగాణ రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువనున్న పేదలందరికీ నిత్యావసర సరుకులు అందించేందుకు తెలంగాణ స్టేట్ ఫ్యామిలీ ఫుడ్ సెక్యూరిటీ కార్డులు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారు, ఐదు ఎకరాలకుపైగా భూమి ఉన్నవారు, వ్యాపారవేత్తలను మినహాయించి మిగిలిన పేదలందరికీ కార్డులు అందించాలని సీఎం తెలిపారు. ఫుడ్ సెక్యూరిటీ కార్డుల కోసం విఆర్‌ఓలకు ఈనెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

 రివ్యూ

రివ్యూ

గ్రామాలలో లబ్దిదారులను గుర్తించేందుకు అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలన చేయాలని, తప్పులు దొర్లితే సదరు అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. లబ్దిదారుల ఎంపిక ఈ నెలాఖరులోగా పూర్తి కావాలన్నారు. జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలకు బియ్యం అందించనున్నట్టు తెలిపారు.

 రివ్యూ

రివ్యూ

ఎమ్మార్వో కార్యాలయంలో వీఆర్వోల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ఇద్దరు రెవెన్యూ అధికారులను కేటాయించాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఫుడ్ సెక్యూరిటీ కార్డు, పెన్షన్ కోసం లబ్దిదారుల ఎంపిక, పెన్షన్‌దారుల గుర్తింపు తదితర కార్యక్రమాలన్నీ తహసిల్దారుల పర్యవేక్షణలో జరగాలని ఆదేశించారు.

 రివ్యూ

రివ్యూ

డివిజన్లవారీగా స్వ్కాడ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో లబ్దిదారుల ఎంపికలో ఏమైనా ఇబ్బందలు తలెత్తితే ప్లయింగ్ స్క్వాడ్‌లో ఉన్న అధికారులు పరిష్కరిస్తారని, ఇందుకోసం హెల్ప్‌లైన్ కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్లను ఆదేశించారు.

 రివ్యూ

రివ్యూ

ఇటీవల నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని కుటుంబాల సమగ్ర స్వరూపాన్ని తెలుసుకున్నదని సీఎం తెలిపారు. సర్వేలో వచ్చిన వివరాలపై మరోసారి పరిశీలన జరిపి అధికారికంగా ప్రకటించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

 రివ్యూ

రివ్యూ

సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సిఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగ్‌రావు, వివిధ శాఖల కార్యదర్శులు నాగిరెడ్డి, రేమండ్ పీటర్, పూనం మాలకొండయ్య, పార్థసారథి, బిపి ఆచార్య, రాజా, జోషి, జిల్లా కలెక్టర్లు రాహుల్ బొజ్జా, శ్రీధర్, జి కిషన్, ఇలంబర్తి, చిరంజీవులు, ప్రియదర్శిని, రోనాల్డ్ రోస్, జగన్మోహన్, వీరబ్రహ్మయ్య, స్మితా సబర్వాల్, జాయింట్ కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

English summary
The Telangana government will be issuing identity cards to residents here based on the recent Intensive Household Survey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X