• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్-స్టాలిన్: దక్షిణాది పాలిటిక్స్‌కు సారథ్యం: జగన్ కలుస్తారా?: రైతు దీక్ష తరహాలో ఉద్యమం

|
Google Oneindia TeluguNews

చెన్నై: అధికార టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రస్తుతం తమిళనాడు పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా శ్రీరంగం ఆలయాన్ని దర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీరంగనాథ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్ భార్య శోభ, కుమారుడు, మున్సిపల్ శాఖక మంత్రి కేటీఆర్, కోడలు శైలిమ, మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి శ్రీరంగం ఆలయాన్ని సందర్శించారు.

 రెండు రాష్ట్రాల సీఎంల భేటీ..

రెండు రాష్ట్రాల సీఎంల భేటీ..

రెండో రోజు పర్యటనలో భాగంగా కేసీఆర్ ఇవ్వాళ చెన్నైలో అధికార డీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కే స్టాలిన్‌తో సమావేశమౌతారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ కాబోతోండటం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమౌతోంది. ఇదివరకే భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని అధికార ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వాన్ని వహిస్తోన్న ప్రతిపక్ష యూపీఏ సంకీర్ణ కూటమికి ప్రత్యామ్నాయంగా థర్డ్‌ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడానికి కేసీఆర్ ప్రయత్నాలు సాగించిన నేపథ్యంలో- ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

దక్షిణాది నుంచే ప్రత్యామ్నాయ కూటమి కోసం..

దక్షిణాది నుంచే ప్రత్యామ్నాయ కూటమి కోసం..


టీఆర్ఎస్, డీఎంకే- రెండూ బీజేపీకి వ్యతిరేక పార్టీలే. కర్ణాటక మినహా దక్షిణాది రాష్ట్రాల్లో బీజపీకి చెప్పుకోదగ్గ బలం లేదు. తెలంగాణలో ఇప్పుడిప్పుడే బలపడుతోంది. ప్రతిపక్షంలో ఉంటూ రెండు అసెంబ్లీ స్థానాలను గెలుచుకోగలిగింది. ఏపీ, కేరళ, తమిళనాడుల్లో బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే. ఈ పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిపై దక్షిణాది రాష్ట్రాల నుంచే రాజకీయంగా ప్రత్యామ్నాయ కూటమిని తెరమీదికి తీసుకుని రావాలనేది కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు.

తొలి అస్త్రంగా..

తొలి అస్త్రంగా..


మోడీ ప్రభుత్వంపై తొలి అస్త్రంగా ధాన్యం సేకరణ అంశాన్ని ప్రయోగించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం స్టాలిన్‌తో ఏర్పాటయ్యే సమావేశంలోనూ ప్రధానంగా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తారని సమాచారం. ధాన్యం సేకరణ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు సారథ్యాన్ని వహించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని అంటున్నారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించిన రైతుల తరహాలో- కేంద్ర్ర ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకుని వచ్చేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నట్లు తెలుస్తోంది.

స్టాలిన్‌తో భేటీ..

స్టాలిన్‌తో భేటీ..


ఇదే విషయంపై స్టాలిన్‌తో చర్చించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కర్ణాటక మినహాయిస్తే.. దక్షిణాదిన ఉన్నవన్నీ బీజేపీయేతర ప్రభుత్వాలే కావడం, వ్యవసాయం, రైతులతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల ధాన్యం సేకరణ అంశానికి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ మద్దతు ఇస్తారని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమతో కలిసి వచ్చే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్దతును కూడగట్టుకుని.. కేంద్ర ప్రభత్వంపై అన్ని రకాలుగా ఒత్తిడిని తీసుకుని రావాలనది కేసీఆర్ ముందున్న యాక్షన్ ప్లాన్‌గా చెబుతున్నారు.

Recommended Video

  ఓట్లు సీట్లు నోట్లు తప్ప ప్రజల పాట్లు కేసీఆర్ సర్కార్‌కు కనిపించవా: ప్రభాకర్
   వైఎస్ జగన్ కలుస్తారా..

  వైఎస్ జగన్ కలుస్తారా..

  దక్షిణాదిన తటస్థంగా ఉంటూ వస్తోన్న పార్టీగా జాతీయ స్థాయిలో రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు గుర్తింపు ఉంది. ఎన్డీఏ, యూపీఏలకు సమదూరాన్ని పాటిస్తున్నారు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రత్యేక హోదా, పోలవరం నిధుల బకాయిలు.. అనేవి ప్రధానంగా తీసుకుంది. అందరూ భావిస్తున్నట్టుగానే కేసీఆర్-స్టాలిన్ ఒక జట్టుకట్టడమంటూ జరిగితే- వైఎస్ జగన్ అందులో కలుస్తారా? లేదా? అనేది చర్చనీయాంశమే. అధికారంలో ఉన్న ఆయా పార్టీలు, ముఖ్యమంత్రులందరూ ఓ కూటమిగా ఏర్పడి తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరాడేలా చేయాలనేది కేసీఆర్ ప్రాథమిక కార్యాచరణ ప్రణాళికగా చెబుతున్నారు.

  English summary
  Chief Minister KCR will meet his Tamil Nadu counterpart MK Stalin at the latter’s residence in Chennai on Tuesday evening.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X