గుంటూరు, గుడివాడలో చదవలేదు: 5192 మందికి అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇచ్చిన రేవంత్
హైదరాబాద్: తాను ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ స్థాయికి ఎదిగానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎల్బీ స్టేడియంలో లెక్చరర్లు, టీచర్లు ఉద్యోగాలకు ఎంపికైన 5192 మందికి నియామక పత్రాలను సీఎం అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఎల్బీ స్టేడియంలోనే రైతును రాజుగా చేసే పాలనకు నాంది పడిందని చెప్పారు. తమ ప్రభుత్వం మూడు నెలల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామన్నారు.
ఆత్మ బలి దానాలతో సాధించిన తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమరుల స్ఫూర్తిని తీసుకుని పని చేయాల్సింది పోయి, వారి లాభార్జన, ధన దాహం తీర్చుకోవడానికే పని చేశారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఫాంహౌస్ మత్తులో ఉండి లక్షలాది యువకుల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమయ్యారని తీవ్ర ఆరోపణలు చేశారు.

నిరుద్యోగ యువత ముందుకు వచ్చి తండ్రి, కుమారుడు, అల్లుడు, కుమార్తెల ఉద్యోగాలు ఊడగొట్టడంతోనే తాము అధికారంలోకి వచ్చి నియామకాలు చేపడుతున్నామన్నారు సీఎం రేవంత్. గత ప్రభుత్వం పేదలకు పాఠశాల విద్యను దూరం చేసిందని రేవంత్ ఆరోపించారు. విద్య ఒక్కటే మనిషి విలువ పెంచుతుందన్నారు.
ఉపాధ్యాయ వృత్తి సామాజిక బాధ్యతగా పేర్కొన్నారు. ప్రజల ప్రోత్సాహంతో మరింత అభివృద్ది చేస్తామన్నారు. తనకు ఇంగ్లీష్ సరిగా రాదని కొందరు అవహేళన చేస్తున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి.. తాను జిల్లా పరిషత్ పాఠశాలలో తెలుగు మీడియం మాత్రమే చదివానని తెలిపారు. గుంటూరు, గుడివాడకు వెళ్లి కార్పొరేట్ పాఠశాలల్లో చదవలేదని బీఆర్ఎస్ నేతలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు.
-
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
హైదరాబాద్లో మాజీ సీఎం ఆస్తి సీజ్.. గంటల్లోనే విముక్తి! అసలేం జరిగింది? -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి!












Click it and Unblock the Notifications