హైదరాబాద్ అంటే నుమాయిష్ ఎగ్జిబిషన్: ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ హామీ
హైదరాబాద్: నాంపల్లి మైదానంలో ఏర్పాటు చేసిన నుమాయిష్ (Numaish) ఎగ్జిబిషన్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. హైదరాబాద్ అంటేనే చార్మినార్, ట్యాంక్‌బండ్, నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తొస్తాయని తెలిపారు. నుమాయిష్‌లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపారవేత్తలందరూ పాల్గొంటారని చెప్పారు. ఎన్నో కళలకు సంబంధించిన వస్తువులు కూడా ఇక్కడ ప్రదర్శించడం అభినందనీయమన్నారు.
నుమాయిష్ కమిటీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలకు ప్రభుత్వం నుంచి పూర్తి తోడ్పాటు అందిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. ఈ ఎగ్జిబిషన్ కమిటీలో మహిళల ప్రాతినిథ్యం ఎంతో అభినందనీయమని, పారిశ్రామిక రంగంలో మహిళలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. కాగా, ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, ఇంజినీర్లు, పలు సంస్థల యజమానులు కలిసి నుమాయిష్‌ను ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ నుమాయిష్ రాష్ట్రానికే గర్వకారణంగా నిలుస్తుందన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీకి చెందిన విద్యా సంస్థల్లో 35 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు.
దశాబ్దాలుగా ఎంతో మంది వ్యాపారవేత్తలను తయారు చేసిందని మంత్రి శ్రీధర్ బాబు కొనియాడారు. ఇక, రాష్ట్ర ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారని.. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో మార్పులు తీసుకొస్తామని శ్రీధర్ బాబు చెప్పారు. కాగా, నుమాయిష్ ఎగ్జిబిషన్ నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు అంటే 45 రోజులపాటు కొనసాగనుంది. నుమాయిష్ కోసం మొత్తం 2400 స్టాల్స్ ఏర్పాటు చేశారు.
Participated in the inauguration of "Numaish" our own Hyderabad's Exhibition today along with Chief Minister Sri @revanth_anumula garu and my cabinet colleague Sri @PonnamLoksabha garu. It's a great platform for Micro,Small &Medium Enterprises to showcase their products and help… pic.twitter.com/xL2eXlN079
— Sridhar Babu Duddilla (@OffDSB) January 1, 2024
కాగా, నుమాయిష్ ఎంట్రీ ఫీజు గతంలో మాదిరిగానే ఉంది. గత ఏడాది రూ.10 పెంచి ధరను రూ.40గా నిర్ణయించారు. ఇప్పుడు కూడా ఈ ధరనే కొనసాగించనున్నారు. నుమాయిష్ సాధారణ రోజులలో సాయంత్రం నాలుగు నుంచి రాత్రి పదిన్నర వరకు, వీకెండ్స్, సెలవు దినాలలో రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. అయితే ఈ సంవత్సరం సమయం పొడిగించే అవకాశాలు ఉన్నాయి. జనవరి 9న లేడీస్ డే పేరుతో మహిళలకు, 31న చిల్ట్రన్ డే పేరుతో పిల్లలకు నుమాయిష్ సందర్శన ఉచితం. మరోవైపు, కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాస్కులు ధరించాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.
-
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications