‘కౌన్ బనేగా కరోడ్ పతి’లో రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రశ్న: సమాధానం చెప్పలేక..!
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ గత 24 ఏళ్లుగా నిర్వహిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి షో గురించి తెలియని వారుండరు. తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో ఈ షోను నిర్వహించారు. కానీ, ఇక్కడ పెద్దగా వర్కవుట్ కాలేదనే చెప్పాలి. ఎంతోమంది పేదవారిని ఈ షో కోటీశ్వరులను చేసింది. కాగా, అమితాబ్ నిర్వహిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి షోలో తాజాగా తెలుగు రాష్ట్రానికి సంబంధించిన ఓ ప్రశ్న వేయడం గమనార్హం.
చాలాసార్లు తెలుగువారి ప్రస్తావన వచ్చినప్పటికీ.. ఈసారి మాత్రం తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వంపై ప్రశ్న వేశారు. కౌన్ బనేగా కరోడ్ పతి షోలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక మహిళకు రూ. 40 వేల ప్రశ్నగా రేవంత్ రెడ్డి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? అనే ప్రశ్నను అడిగారు అమితాబ్ బచ్చన్. ఇందుకు ఆప్షన్లుగా ఛత్తీస్ గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు.

అయితే, ఆమె దీనికి జవాబు చెప్పలేకపోయింది. నాలగు లైఫ్ లైన్‌లలో ఒకటి అయిన ఆడియన్స్ పోల్ ను ఎంచుకుంది. దీంతో 80 శాతం ఆడియన్స్ తెలంగాణ అని సమాధానం చెప్పారు. మరో 20 శాతం మంది ఛత్తీస్‌గఢ్ అని చెప్పారు. ఈ క్రమంలో ఎక్కువ శాతం మంది చెప్పిన తెలంగాణనే ఆమె తన జవాబుదా చెప్పింది. ఆ జవాబు సరైనది కావడంతో ఆమెకు రూ. 40 వేలు లభించడంతోపాటు ముందుకు కదిలింది. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Shri Revanth Reddy belongs to Which state of Chief Minister?
— Ashish Singh (@AshishSinghKiJi) December 29, 2023
Kaun Banega Crorepati 🔥🔥🔥♥️@revanth_anumula Please Must Watch pic.twitter.com/uIIocitS6e
కాగా, ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగా.. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్, రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ, ఛత్తీస్‌గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయి, మిజోరాం ముఖ్యమంత్రిగా లాల్ దహోమా బాధ్యతలు చేపట్టారు.












Click it and Unblock the Notifications