కొండా సురేఖ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ స్పందన!

తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండా సురేఖ వ్యవహారంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. నేడు సచివాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కేవలం తన అమెరికా పర్యటన రద్దుకు కేంద్రం, ప్రధాని మోదీ రాజకీయ కక్షనే కారణం అన్నారు. కేవలం తన పర్యటన అంశాన్ని మాత్రమే మాట్లాడిన సీఎం రేవంత్ ను మీడియా కొండా సురేఖ వ్యవహారంపై ప్రశ్నించారు.

కొండా సురేఖ వ్యవహారంపై రేవంత్ రెడ్డి స్పందన ఇదే

దీంతో కొండా సురేఖ, ఆమె కుమార్తె సుస్మిత వ్యాఖ్యలు, అనంతర పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పార్టీలో ఈ అంశంపై విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఎం స్పందన ఆసక్తికరంగా మారింది. కొండా సురేఖపై చర్యలు తీసుకుంటారని పలువురు భావిస్తున్న వేళ సీఎం స్పష్టంగా మాట్లాడారు. "పార్టీ అంతర్గత విషయాలను నేను చర్చించను. క్రమశిక్షణ కమిటీ, పీసీసీ, ఏఐసీసీ వాటిని పరిశీలిస్తాయి అంటూ సమాధానంఇచ్చారు.

Telangana CM Revanth Reddy said he would not discuss the Konda Surekha issue as it is an internal party matter

పార్టీ నిర్ణయానికి కట్టుబడే ఉంటాం

వారు తీసుకున్న నిర్ణయాలకు అందరూ కట్టుబడాల్సిందే" అని సీఎంస్పష్టం చేశారు. ఇప్పటికే ఏఐసీసీ సీఎం రేవంత్ రెడ్డితో పాటు, భట్టి విక్రమార్క తడుతరుల అభిప్రాయాలను కూడా కొండా సురేఖ వ్యవహారంలో తీసుకున్నారు. దీనిపై అధిష్టానం అంతర్గత విచారణ జరుపుతోంది. దీనిపై కీలక నిర్ణయం తీసుకుంటారు అన్న అభిప్రాయం కూడా ఉంది.

కొండా కుటుంబం వ్యవహారశైలిపై రేవంత్ కు అసంతృప్తి

ఇక కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగించాలని కూడా డిమాండ్ వినిపిస్తున్న క్రమంలో అధిష్టానం అన్ని రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలించి పార్టీకి డ్యామేజ్ జరగకుండా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సుస్మిత సీఎంపై చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత కొండా కుటుంబం వ్యవహారశైలి పై పార్టీలో, సీఎం రేవంత్ రెడ్డిలో కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది.

క్రమశిక్షణ ప్రక్రియను గౌరవిస్తున్నట్లు రేవంత్ ప్రకటన

ఆయన పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఈ మేరకు పీసీసీ ఇప్పటికే అధిష్ఠానానికి నివేదిక పంపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం ప్రత్యక్షంగా ఏమీ చెప్పకుండా పార్టీ వ్యవస్థలపై బాధ్యత వదిలేశారు. అంతర్గత విషయాల్లో తాను జోక్యం చేసుకోనని స్పష్టం చేయడం ద్వారా క్రమశిక్షణ ప్రక్రియను గౌరవిస్తున్నట్లు సూచించారు.

ఇది రేవంత్ రెడ్డికి జరిగిన అవమానం కాదు.. తెలంగాణా ప్రజలకు జరిగిన అవమానం!
ఇది రేవంత్ రెడ్డికి జరిగిన అవమానం కాదు.. తెలంగాణా ప్రజలకు జరిగిన అవమానం!

పార్టీ నిర్ణయంపై ఉత్కంఠ

పార్టీలో కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని పలువురు ఎమ్మెల్యేలు, నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే సీఎం ఈ అంశాన్ని పార్టీ అధికారిక వేదికలకు వదిలేయడం గమనార్హం. ఏఐసీసీ, పీసీసీ, క్రమశిక్షణ కమిటీ నిర్ణయాలే తుది అని సీఎం సూచించడం పార్టీలోని వివాదాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. తదుపరి పరిణామాలు పార్టీ అధిష్ఠానం నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+