తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీపై సంచలన నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి

తెలుగు సినీ పరిశ్రమపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు. ప్రభుత్వానికి సహకారం అందించాల్సిన సమయంలో ఏ స్పందనా లేకుండా మౌనంగా ఉండి, ఇప్పుడు కొండా సురేఖపై మూకుమ్మడిగా ఖండనలిస్తుండటంతో రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉందని, డ్రగ్స్ వాడొద్దంటూ యువతకు సూచించేవిధంగా సినీ రంగంలోని సెలబ్రిటీలంతా ముందుకు రావాలని, వారిని చైతన్యపరచాలని కోరితే ఇంతవరకు ఒక్కరు కూడా స్పందించలేదు. కేవలం చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే వీడియోలు చేసి విడుదల చేశారు.

ఒక్కరు కూడా ముందుకు రాలేదు
టికెట్ ధరలను పెంచుకోవడానికి మాత్రం ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తున్న సినీ ప్రముఖులు నంది అవార్డు స్థానంలో గద్దర్ పేరుతో అవార్డులిస్తామంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. దీనిపై మాట్లాడలేదు. మరోవైపు ఏపీ ప్రభుత్వం నుంచి గత ఐదు సంవత్సరాల్లో సినీ పరిశ్రమకు ఎక్కడా సహకారం అందలేదు. అయితే గత పది సంవత్సరాల్లో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంతో సినీ పరిశ్రమకు సత్సంబంధాలే ఉండేవి. అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం పరిశ్రమకు అనుకూలంగానే ఉంది. అయితే హైడ్రా కూల్చివేతల్లో భాగంగా నాగార్జున ఎన్ కన్వెన్షన్ కేంద్రాన్ని కూల్చేశారు.

telangana cm revanth reddy sensational decision on telugu film industry

సానుకూలత అవసరంలేదు
కొండా సురేఖ కేటీఆర్ పై వ్యాఖ్యలు చేసే క్రమంలో నాగార్జున కుటుంబాన్ని, సమంతను బయటకు లాగడంతో సినీ పరిశ్రమ మొత్తం ఒక్కసారిగా ప్రభుత్వంపై తిరగబడినట్లైంది. సురేఖ వ్యాఖ్యలపై ప్రముఖులంతా మండిపడుతున్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని పెద్దది చేయొద్దంటూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సినీ పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు. బాలయ్య, పవన్ కల్యాణ్ మాత్రం స్పందించలేదు. సినీ పరిశ్రమ అతిగా స్పందిస్తోందని సీఎం రేవంత్ భావిస్తున్నారు. కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న తర్వాత కూడా సినీ పెద్దలు స్పందించడం ముఖ్యమంత్రికి నచ్చలేదు. పరిశ్రమపై సానుకూలంగా ఉండాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో టికెట్ ధరలు పెంచుకుంటామని వచ్చినప్పుడు, అది కావాలి, ఇది కావాలంటూ వచ్చినప్పుడు అప్పటి సందర్భాన్ని చూడాలేకానీ వెంటనే స్పందించాల్సిన అవసరం లేకుండా చూడాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+