భారత్ పాక్ యుద్ధం.. తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ నిర్ణయం!

భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ అన్ని రాష్ట్రాలలోని ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఐక్యతను చాటుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది.

నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు ప్రజాప్రతినిధుల ఒక నెల వేతనం విరాళం
పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై సైనిక దాడి నేపథ్యంలో నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఒక నెల వేతనం విరాళంగా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చించారు. సీఎం సూచన మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి ఒక నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించనున్నారు.

Telangana CM Revanth Reddy sensational decisions amid India-Pakistan tensions

Take a Poll

సరిహద్దు రాష్ట్రాలలోని తెలంగాణ వాసుల కోసం కంట్రోల్ రూమ్
ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే సరిహద్దు రాష్ట్రాలలో ఉన్న తెలంగాణ పౌరుల కోసం, వారికి సహాయం అందించడం కోసం కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో సరిహద్దు రాష్ట్రాలలోని తెలంగాణ వాసుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

సరిహద్దులో ఉన్న తెలంగాణా వాసుల సహాయం కోసం ఢిల్లీలో ఏర్పాటు
అంతర్జాతీయ సరిహద్దులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, సరిహద్దు రాష్ట్రాలలో ప్రస్తుతం నివసిస్తున్న,చిక్కుకున్న తెలంగాణ వాసులకు సకాలంలో సహాయం, సమాచారం, సేవలను అందించే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. నిరంతరాయంగా సేవలను నిర్ధారించడానికి ఈ కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తుందని వెల్లడించింది. ఈ కంట్రోల్ రూమ్ కి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఈ నెంబర్లలో సంప్రదించాలని సూచన
ల్యాండ్‌లైన్: 011-23380556
వందన, రెసిడెంట్ కమిషనర్ ప్రైవేట్ సెక్రటరీ & లైజన్ హెడ్ - 9871999044
హైదర్ అలీ నఖ్వీ, రెసిడెంట్ కమిషనర్ వ్యక్తిగత సహాయకుడు - 9971387500
జి. రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్ - 9643723157
సిహెచ్. చక్రవర్తి, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ - 9949351270.
ఎవరికైనా ఎటువంటి సహాయం కావాలన్నా పైన పేర్కొన్న నెంబర్లలో సంప్రదించవచ్చని ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా.గౌరవ్ ఉప్పల్ తెలిపారు. తెలంగాణ పౌరుల భద్రత కోసం ఈ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+