సీఎం క్యాంపు కార్యాలయం జూబ్లీహిల్స్‌కు మారనుందా? ఆ ఆఫీసును పరిశీలించిన రేవంత్

హైదరాబాద్: తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయంగా ఉన్న ప్రజాభవన్(ప్రగతిభవన్)ను కాంగ్రెస్ ప్రభుత్వం మరో చోటికి మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCRHRD) ప్రాంగణలోకి సీఎం క్యాంపు కార్యాలయం మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీ ప్రాంగణంలో గుట్టమీద ఉన్న బ్లాక్‌లోకి మార్చే ఆలోచనలు తెరమీదకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ భవనాన్ని ఆదివారం ఎలక్ట్రిక్ వాహనంలో పరిశీలించారు. ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. కాగా, రేవంత్ రెడ్డి నివాసం జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి సమీపంలో ఉండటంతో క్యాంపు కార్యాలయంగా అక్కడికి దగ్గరలోనే (జూబ్లీహిల్స్ రోడ్ నెం. 25) ఉన్న హెచ్ఆర్డీ ప్రాంగణంలోకి మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Telangana CM Revanth Reddy visits mcr hrd campus for camp office

45 ఎకరాల విస్తీర్ణంతో ఉన్న ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీ ప్రాంగణంలో 150 మంది కూర్చునే నాలుగు కాన్ఫరెన్స్ హాళ్లు, పరిపాలక మండలి సమావేశం కావడానికి వీలుగా బోర్డ్ రూమ్, 250 మంది కూర్చునే ఆడిటోరియం, అతిథులకు ఆతిథ్యం ఇవ్వడానికి మంజరీ, కృష్ణ, గోదావరి, తుంగభద్ర పేర్లతో విడివిడి బ్లాకులు ఉన్నాయి.

ఈ ప్రాంగణంలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటైతే రెగ్యూలర్ గా జరిగే కాన్ఫరెన్స్ లు, లెక్చర్లు, ట్రైనింగ్ తదితర కార్యకలాపాలకు సెక్యూరిటీ కారణాలతో ఇబ్బంది లేకుండా విడి ఎంట్రీగా గుట్టమీద ఎత్తుగా ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేసేలా ఆలోచలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి క్యాంపు కార్యాలయంపై త్వరలో అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+