నేరుగా రైతుకి ఫోన్ చేసి మాట్లాడిన సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ ఓ రైతుకు నేరుగా ఫోన్ చేశారు. నిన్న తాను చేసిన ‘రైతులకు ఉచిత ఎరువులు’ ప్రకటన ఎలా ఉందంటూ అడిగారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఓ రైతుకు నేరుగా ఫోన్ చేశారు. నిన్న తాను చేసిన 'రైతులకు ఉచిత ఎరువులు' ప్రకటన ఎలా ఉందంటూ అడిగారు. దీనిపై ఆ రైతు హర్షం వ్యక్తం చేశారు. మీరు తీసుకున్న నిర్ణయం చాలా బాగుందంటూ ముఖ్యమంత్రిని ప్రశంసించారు.
ఇటీవల సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం లబ్ధిదారు అయిన ఓ మహిళకు ఫోన్ చేసి ఆమెతో మాట్లాడి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన విషయం తెలిసిందే. తనలాంటి సాధారణ మహిళకు సీఎం ఫోన్ చేయడం పట్ల ఆమె కూడా పట్టరాని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఇదే మాదిరిగా గురువారం రాత్రి కేసీఆర్ పాలకుర్తి మండలం రాఘవపురం గ్రామానికి చెందిన చెందిన రైతు నల్ల నాగిరెడ్డి కి ఫోన్ చేశారు. వచ్చే ఏడాది నుంచి కాంప్లెక్స్ ఎరువులను ఉచితంగా అందిస్తానని నిన్న తాను చేసిన ప్రకటన ఎలా ఉందంటూ వాకబు చేశారు.
సీఎం నేరుగా తనకు ఫోన్ చేసి మాట్లాడడంతో నాగిరెడ్డి ఆనందభరితుడయ్యారు. మీరు తీసుకున్న నిర్ణయం చాలా బాగుందని, రైతులు మిమ్మల్ని జీవితంలో మరిచిపోరని ఆయన సీఎం కేసీఆర్‌తో అన్నారు.












Click it and Unblock the Notifications