జీఎస్టీ పరిధిలోకి: పెట్రోల్, డీజిల్ ధరలపై తెలంగాణ కాంగ్రెస్ భారీ ఆఫర్!
హైదరాబాద్: భారత్ బంద్‌లో ప్రజలు స్వచ్చంధంగా పాల్గొన్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో పెట్రోల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయని మండిపడ్డారు.
కేంద్రం ధరలు పెంచుతూ ఉంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెరాస ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. వారు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేంద్రంతో పోటీ పడి మరీ ఇక్కడ కేసీఆర్ ధరలు పెంచారని ఉత్తమ్ విమర్శించారు. రాష్ట్రంలో పెట్రోల్ పైన 35 శాతం, డీజిల్ పైన 27 శాతం పన్నులు విధిస్తున్నారన్నారు.

కేంద్రం పెట్రో ధరలను జీఎస్టీలోకి ఎందుకు చేర్చలేదని జానారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెట్రో ధరలను జీఎస్టీలోకి తీసుకు వస్తామన్నారు. రేపటి (మంగళవారం) నుంచి ఈ నెల 18వ తేదీ వరకు కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ ఉంటుందని తెలిపారు.
పొత్తులపై ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఎన్నికల వేడి నేపథ్యంలో తెలంగాణలో పొత్తులపై కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. అతి త్వరలో పొత్తులపై రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతామని తెలిపారు. ఇవాళ కూడా పలు పార్టీలతో చర్చించామన్నారు. 12న ఆజాద్ సమక్షంలో పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరుతారన్నారు. తనను తెరాస నేత దానం నాగేందర్ కలిస్తే తప్పేమిటని ప్రశ్నించారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications