'అందరినీ కలుపుకుపోవాలి', 'సెటిలర్లను ఆకర్షించాలి', 'పాదయాత్ర చేస్తా'

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాష్ట్రంలో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇంచార్జీ కుంతియాకు చెప్పినట్టు మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ చెప్పారు.

ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం హైద్రాబాద్‌లో జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించినట్టుగా ఆయన చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై చర్చించినట్టుగా ఆయన చెప్పారు. అంతేకాదు రానున్న 18 నెలల్లో ఏ కార్యక్రమాలను నిర్వహించాలనే దానిపై కూడ విస్తృతంగా చర్చించినట్టు ఆయన చెప్పారు.

Telangana congress meeting held at Hyderabad

సెటిలర్స్ ఓటు బ్యాంకును ఆకర్షించాలని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో చెప్పారు. సెటిలర్లలో ఓ నాయకుడిని గుర్తించి ప్రత్యేక పదవిని ఇవ్వాలని ఆయన సూచించారు. ప్రతి మూడు మాసాలకు సభను ఏర్పాటు చేయాలన్నారు.వచ్చే ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ చీఫ్ పదవిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డినే కొనసాగించాలని ఆయన కోరారు.

రాష్ట్రంలో పాదయాత్ర చేస్తానని రాష్ట్ర పిసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మల్లు భట్టి విక్రమార్కకు చెప్పారు.

అయితే ఈ విషయమై పార్టీ నిర్ణయం తీసుకొంటుందన్నారు. పార్టీ అనుబంధ విభాగాల కమిటీలను మూడు మాసాల్లో పూర్తి చేయాలని కోరినట్టు ఆయన చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Congress party meeting held at Hyderabad on Sunday. TPcc Incharge Kuntia attended this meeting. Party senior leaders expressed their opinion.
Please Wait while comments are loading...