నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణాలో కరోనా ఉధృతి : సెకండ్ వేవ్ ప్రభావం, గత 24 గంటల్లో 2251 కొత్త కేసులు , 6 మరణాలు

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లోనూ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తుంది . తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ రాష్ట్ర ప్రజలను వణికిస్తోంది. అంతకంతకు కేసులు పెరుగుతున్న తీరు తెలంగాణ రాష్ట్రంలో ఆందోళనకు కారణం అవుతుంది . అధికారికంగా నమోదైన కేసులు కంటే, అనధికారికంగాను భారీగా కేసులు వెలుగుచూస్తున్న పరిస్థితి ఉంది .

Recommended Video

Covid-19 : Cases in Telangana cross the 1,000 mark again

ఏపీలో కరోనా పాజిటివ్ వచ్చినా పకోడీలు వేసి వస్తానన్న బాధితుడు ... వైద్య సిబ్బంది షాక్ !!ఏపీలో కరోనా పాజిటివ్ వచ్చినా పకోడీలు వేసి వస్తానన్న బాధితుడు ... వైద్య సిబ్బంది షాక్ !!

 గడచిన 24 గంటల్లో 2,251 మందికి కరోనా పాజిటివ్

గడచిన 24 గంటల్లో 2,251 మందికి కరోనా పాజిటివ్

తాజాగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం గడచిన 24 గంటల్లో 2,251 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజాగా కరోనా మహమ్మారి కారణంగా ఆరుగురు మృతి చెందినట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం కరోనా కేసులు 3,24, 091 కాగా, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 17,791 కు పెరిగింది . గడచిన 24 గంటల్లో 79,027 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,251 కేసులు నమోదయ్యాయి .

 గత 24 గంటల్లో 6 మరణాలు

గత 24 గంటల్లో 6 మరణాలు

శనివారంతో పోల్చుకుంటే ఆదివారం రోజు నమోదైన కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య కాస్త తగ్గటం ప్రస్తుతానికి ఊరట కలిగిస్తోంది.

కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటివరకూ ఆరుగురు ప్రాణాలు కోల్పోగా రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా మృతుల సంఖ్య 1759 కు చేరుకుంది. నిన్న ఒక రోజే కరోనా బారినుండి కోలుకుని బయటపడిన వారు 584 మంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,04,548 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు .

విపరీతంగా నమోదవుతున్న కేసులు .. ఆందోళనకరంగా కరోనా స్థితి

విపరీతంగా నమోదవుతున్న కేసులు .. ఆందోళనకరంగా కరోనా స్థితి

మరోవైపు జిహెచ్ఎంసి పరిధిలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న తీరు హైదరాబాద్ వాసులకు ఆందోళన కలిగిస్తుంది . రంగారెడ్డి, నిజామాబాద్ , ఉమ్మడి వరంగల్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది . రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న తీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురి చేస్తూ ఉండగా, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ప్రజలందరూ బాధ్యతాయుతంగా ఉండాలని సామాజిక దూరం పాటించాలని , మాస్కులు ధరించాలని పదే పదే విజ్ఞప్తి చేస్తోంది.

English summary
According to the latest data from the Telangana State Medical Health Department, 2,251 people have been diagnosed with corona positive in the past 24 hours. Official figures put the death toll at six due to the latest corona epidemic. So far, the total number of corona cases in Telangana is 3,24,091, while the number of corona active cases in Telangana has increased to 17,791.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X