Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వచ్చే నెల నుంచి వారంతా విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు

భద్రాద్రి కొత్తగూడెం: వచ్చే నెల (మార్చి) నుంచి 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లు వచ్చినవారు చెల్లించాల్సిన అవసరం లేదని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. త్వరలో కొత్త విద్యుత్ పాలసీని తీసుకొస్తామన్నారు. కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో డిప్యూటీ సీఎం భట్టి పాల్గొని ప్రసంగించారు. గత ఐదేళ్లుగా విద్యుత్ పాలసీ లేకపోవడంతో రాష్ట్రానికి ఎవరూ రాలేదన్నారు.

రాష్ట్రంలోని బొగ్గు గనులన్నీ సింగరేణికే చెందాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని భట్టి విక్రమార్క చెప్పారు. 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సర్క్యూలర్ జారీ చేసిందన్నారు. గత పదేళ్లుగా కనీస వేతన చట్టం లేక లక్షలాది కార్మికులు నష్టపోయారని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ఎస్ఆర్ఎస్పీ భారీ ప్రాజెక్టులపై పంప్ స్టోరేజీ ప్రణాలికలు చేస్తున్నామని చెప్పారు.

Telangana deputy cm mallu bhatti vikramarka key comments on 200 units free electricity scheme

ఫిబ్రవరి 27న చేవెళ్ల సభలో మరో రెండు గ్యారంటీల అమలు ప్రకటన చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం ప్రారంభించిన భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలు రాష్ట్రానికి గుదిబండలా మారాయని డిప్యూటీ సీఎం ధ్వజమెత్తారు. డ్వాక్రా సంఘాలకు త్వరలో వడ్డీలేని రుణాలు అందిస్తామన్నారు.

ఫిబ్రవరి 26 సాయంత్రం 43 వేల మంది సింగరేణి కార్మికులకు కోటి రూపాయల బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితం కావడంతో సింగరేణిలో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయిందని భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఉద్యోగం కల్పించడమే ఇందిరమ్మ సంక్షేమ రాజ్య లక్ష్యమన్నారు. కాగా, ప్రియాంక గాంధీ చేతుల మీదుగా రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+