Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

40 రైల్వే ప్రాజెక్ట్ లతో పాటు కోచ్ ఫ్యాక్టరీ.. తెలంగాణా పంట పండింది!

ఏకకాలంలో అనేక రైల్వే ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం పైన కేంద్రం దృష్టి సారించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు 75% పూర్తయ్యాయని, ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ: కిషన్ రెడ్డి
నేడు కాజీపేటలోని రైల్వే తయారీ యూనిట్‌ను కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తదితరులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారమవుతోందని అన్నారు. 2023లో కాజీపేటలో రైల్వే తయారీ యూనిట్ నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేశారని, పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.

Telangana development with those railway projects Union Minister said good news on the railway coach factory

రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి కీలక విషయాలు చెప్పిన కిషన్ రెడ్డి
రూ. 521 కోట్ల వ్యయంతో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును అమలు చేస్తోందన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో జరుగుతున్న వివిధ విభాగాల నిర్మాణాల తీరు తెన్నులను వివరించారు. RMUలో 16కోచ్ MEMU రేక్‌లను తయారు చేయాలని ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు. రాబోయే రైల్వే తయారీ యూనిట్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలు అభివృద్ధిని సాధిస్తున్నాయన్నారు.

ఏకకాలంలో 40 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు
వందే భారత్ రైళ్లు, కొత్త రైళ్లు, అమృత్ స్టేషన్లు, విద్యుదీకరణ, KAVACH మొదలైనవి శరవేగంగా అమలు జరుగుతున్నాయన్నారు. అంతకుముందు కిషన్ రెడ్డి వరంగల్ రైల్వే స్టేషన్ ను పరిశీలించారు. స్టేషన్లో అందిస్తున్న ప్రయాణికుల సౌకర్యాలపైన అధికారులతో సమీక్షించారు. తెలంగాణలో జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనుల పైన ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏకకాలంలో 40 రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

Telangana development with those railway projects Union Minister said good news on the railway coach factory

కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభించిన కేంద్ర మంత్రి
సింగిల్ లైన్ ఉన్నచోట డబుల్ లైన్స్ గా మార్చడం, డబుల్ రైల్వే లైన్స్ ఉన్నచోట థర్డ్ లైన్ పనులు చేయడం, రైల్వేస్టేషన్ల రూపురేఖలను మార్చడంతో పాటు, కొత్త రైల్వే స్టేషన్లను, కొత్త రైళ్లను ఏర్పాటు చేయడం వంటి చర్యలను చేపడుతున్నట్లు తెలిపారు. జనవరి నెలలో కొమురవెల్లి రైల్వే స్టేషన్ ను ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+