తీపి కబురు: కొత్త జిల్లాల ప్రకారమే డీఎస్సీ, ఒకటిరెండ్రోజుల్లో నోటిఫికేషన్!

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: డీఎస్సీ నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు డీఎస్సీ-2017 నిబంధనలను విడుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు మంగళవారం జారీ చేసింది. ఉపాధ్యాయ నియామక నిబంధనలను వెల్లడించింది.

కొత్త జిల్లాల ప్రకారమే ఉపాధ్యాయుల నియామకాలను చేపట్టనున్నట్లు స్పష్టంచేసింది. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా ఈ నియామకాలను భర్తీ చేయనున్నారు. దీంతో పాటు అర్హతలు, టెట్‌ వెయిటేజీ నిబంధనలను ప్రభుత్వం ప్రకటించింది.

It is said that Telangana dsc notification likely to release one or two days.

కాగా, ఏపీటెట్, టీఎస్‌టెట్, సీ-టెట్, క్వాలిఫై అయినవారిని అర్హులుగా ప్రకటించింది. కాగా, భర్తీ ప్రక్రియకు అనుమతినిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సంతకం చేశారు. ఈ ఉత్తర్వులు టీఎస్‌పీఎస్సీకి చేరిన తదుపరి ఒకటిరెండ్రోజుల్లో టీఎస్‌పీఎస్సీ 8,972 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that Telangana dsc notification likely to release one or two days.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి