విద్యార్థులకు అలర్ట్: ఎంసెట్ పరీక్ష తేదీల్లో మార్పులు, కొత్త షెడ్యూల్ ఇదే

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్(TS EAMCET) పరీక్ష షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. మే 7 నుంచి 11 వరకు జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష తేదీల్లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలను మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు వెల్లడించారు.

నీట్(NEET), టీఎస్‌పీఎస్సీ(TSPSC) పరీక్షల కారణంగానే ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీంల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులూ లేవని.. మే 10, 11 తేదీల్లోనే ఈ పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని తెలిపారు.

Telangana EAMCET 2023 Exam Dates Changed: Check Here For New Schedule

కాగా, ఎంసెట్ దరఖాస్తుల గడవు ఏప్రిల్ 4తో ముగియనుంది. ఆలస్య రుసుముతో మే 2 వరకు ఎంసెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 30 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి తెలిపింది.

ఇక గురువారం సాయంత్రం వరకు తెలంగాణ ఎంసెట్(ఇంజినీరింగ్)కు 1,14,989 మంది దరఖాస్తు చేసుకోగా, అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్‌కు 65,033 మంది, రెండింటికీ 218 మంది విద్యార్థులు చొప్పున మొత్తంగా 1,80,240 మంది దరఖాస్తు చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+