Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈసారి గట్టెక్కుతామా.. ఓటేస్తున్న పొలిటీషియన్లందరికీ ఒకటే పరేషాన్!!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పండుగ కొనసాగుతుంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాజకీయ ప్రముఖులు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఓటేసి ఓటు ప్రాధాన్యత అందరికీ చెప్తున్నారు. ఓటు వేస్తున్న ప్రతీ ఒక్కరిలో టెన్షన్ నెలకొంది. ఈసారి గట్టెక్కుతామా లేదా అన్నది అందరిలోనూ ఉత్కంఠ గా మారింది.

ఇప్పటికే సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో సూర్యాపేట నియోజకవర్గం టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి జగదీశ్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్ ఎర్రమంజిల్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేటలో బిజెపి దుబ్బాక అభ్యర్థి రఘునందన్ రావు తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఓటు ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతిఒక్కరు ఓటుహక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

telangana election polling: fear of defeat to politicians and candidates who are voting

బోయినపల్లి లో మంత్రి మల్లారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంబర్ పేట బర్కత్ పురాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటేయాలని పిలుపునిచ్చిన ఆయన ఓటు హక్కు చాలా విలువైందని పవిత్రమైందని గుర్తు చేశారు. కరీంనగర్ ముఖరం పూర్ స్కూల్లో ఎంపీ బి వినోద్ కుమార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

telangana election polling: fear of defeat to politicians and candidates who are voting

బంజారా హిల్స్ లో ఎమ్మెల్సీ కవిత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ ఎన్నికల్లో మహిళలు ఎక్కువ శాతం ప్రభావం చూపుతారని, యువత తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కవిత పిలుపునిచ్చారు.ఖమ్మం నగరంలోని హార్వెస్ట్ స్కూల్ పోలింగ్ బూత్ లో పార్టీ అభ్యర్థి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కూకట్పల్లి బూత్ నెంబర్ 12లో బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖమ్మం జిల్లా నారాయణపురం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

శేరిలింగంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పరకాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్లారెడ్డి పల్లి లో ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేస్తున్నా, ప్రజలకు ఓటు వెయ్యాలని పిలుపునిస్తున్న అందరిలో ఆందోళన స్పష్టం గా కనిపిస్తుంది. ఓటరు దేవుళ్ళు ఏం చేస్తారో అన్నది ఆసక్తిగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+