telangana election polling: పోలింగ్ కేంద్రంలో ఈ పని చేస్తే అరెస్ట్ తప్పదు!!

రేపు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల పండుగ జరగబోతుంది. ఎన్నికల పండుగకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఓటర్లు రెడీ అవుతున్నారు. అయితే ఈసారి కొత్త ఓటర్లు మాత్రం రెట్టించిన ఉత్సాహంతో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈసారి ఓటర్లుగా ఎన్ రోల్ చేసుకున్న యువత తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్న ఆనందంలో ఉన్నారు.

తొలిసారిగా ఓటు హక్కును ఉపయోగించుకునే వారు ఓటు వేసే విషయంలో చాలా ఉత్సాహంగా ఉంటారు. యువతీ యువకులు తాము ఓటు వేసి, తాము ఓటు హక్కును వినియోగించుకున్నామని చెప్పే ప్రయత్నంలో భాగంగా పోలింగ్ కేంద్రాల వద్ద సెల్ఫీలు తీసుకుంటూ హడావిడి చేస్తూ ఉంటారు. తమ వేలికి వేసి ఉన్న సిరా చుక్కను చూపెడుతూ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు.

telangana election polling: If you take selfies in the polling center you will be arrested!!

ఓటు వేసే సమయంలో ఫోటో దిగాలి అనుకునే ప్రబుద్ధులు కూడా ఉంటారు. అంతేకాదు విఐపిలు ఓటు వేస్తుంటే, పోలింగ్ కేంద్రాల వద్ద విఐపిలు వస్తే వారిని కూడా సెల్ ఫోన్లలో క్లిక్ మనిపించే వాళ్ళు లేకపోలేదు. అయితే ఈ క్రమంలో తాజాగా ఎన్నికల కమిషన్ విధించిన ఆంక్షలు కొత్త ఓటర్లను నిరుత్సాహానికి గురి చేస్తున్నాయి.

ఓటు వేసేందుకు వెళ్లే ఓటర్లు పోలింగ్ సెంటర్లోకి సెల్ ఫోన్ తీసుకు వెళ్ళడానికి అనుమతి లేదు. అంతేకాదు సెల్ఫీ తీసే ప్రయత్నం చేస్తే అరెస్టు చేసే ఛాన్స్ కూడా ఉంటుందని, ఇక ఆ ఓటు లెక్కించరని చెబుతున్నారు. పోలింగ్ కేంద్రంలో కెమెరాలతో కూడా ఎవరూ ఫోటోలు తీయకూడదని సూచిస్తున్నారు.

ఇక ఈ క్రమంలో పోలింగ్ కేంద్రాలకు సెల్ ఫోన్ అనుమతించబోమని ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో సెల్ఫీ ప్రియులకు ఈసీ షాక్ ఇచ్చినట్లు అయింది. యంగ్ ఓటర్ లు తాము ఓటు వేసినట్టు సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం మంచిదే .. దీనివల్ల మిగతా వారిలో కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలనే చైతన్యం వస్తుంది. అయితే పోలింగ్ కేంద్రాల వద్దకు ఫోన్లను అనుమతిస్తే మాత్రం వారితో తలనొప్పే అని భావించిన ఎన్నికల సంఘం ఈ నిబంధనలను విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+