telangana election polling: పోలింగ్ ఏర్పాట్లపై వరంగల్ సీపీ ఏమన్నారంటే!!
రేపు జరగబోయే శాసన సభ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఈ ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లపై వరంగల్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల వేళ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీ ప్రణాళికను రూపొందించి భద్రతా చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు.
సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించి ఆ ప్రాంతాల్లో భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశామన్నారు. కమిషనరేట్ పరిధిలోని వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, వర్థన్నపేట, పరకాల, జనగామ, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో మొత్తం 1128 పోలీంగ్ ప్రాంతాల్లో, 2126 పోలీంగ్‌బూతులను ఏర్పాటు చేశామన్నారు.

ఈ ఎన్నికల నిర్వహణకై డిసిపి స్థాయి నుండి హోంగార్డు స్థాయి వరకు మొత్తం 4వేల మంది పోలీస్ సిబ్బందిని నియమించడంతో పాటు 1700 మందికిపైగా కేంద్ర సాయుధ పోలీసులు ఈ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎన్నిక ల కోడ్ అమలు నాటి నుండి ఇప్పటి వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన తనీఖీల్లో మొత్తం 12కోట్ల, 33 లక్షల రూపాయలకు పైగా డబ్బు పోలీస్ స్వాధీనం చేసుకున్నారన్నారు.
దీనితో పాటు, 55 లక్షల రూపాయల విలువ గల మద్యాన్ని , గుడంబాను పోలీసులు స్వాధీనం చేసుకోగా, పది లక్షల విలువగల ఐదు వందల కిలోల నల్లబెల్లం, పటిక, ఒక కోటి 64లక్షల రూపాయల విలువైన 667 కిలోల గంజాయి, ఆరున్నర కిలోల బంగారం, కిలోన్నర వెండి అభరణాలతో పాటు, ఓటర్లకు అందించేందుకు 13లక్షల రూపాయల విలువగల బహుమతులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కమిషనరేట్ పరిధిలో మొత్తం 842 కేసులను నమోదు చేయబడ్డాయని. ముఖ్యంగా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఇప్పటి వరకు 7842 మందిని ముందస్తు అరెస్టులు చేయగా, ఇందులో 579 మంది రౌడీ షీటర్లు వున్నారన్నారు.ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పోలీస్ విభాగం పలు ఆంక్షలను విధించిందని, ఎన్నికల ప్రవర్తన నియామవళిని ప్రజలు పాటించాలని సూచించారు.












Click it and Unblock the Notifications