ఇది దొరల తెలంగాణాకు ప్రజా తెలంగాణాకు మధ్య జరుగుతున్న యుద్ధం: రాహుల్ గాంధీ!!
రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ నేత రాజుల గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి దొరల తెలంగాణకు ప్రజా తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఆని, తెలంగాణ వచ్చినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని అన్నారు. జగిత్యాల సభలో ఆయన మాట్లాడుతూ... కెసిఆర్ కుటుంబ పాలన పై విరుచుకు పడ్డారు.
రాజులు పోయినా ఇంకా తెలంగాణలో రాచరిక పాలనే కొనసాగుతోందన్నారు. అలాగే బిఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఈ మూడు పార్టీలు ఒక్కటే నని, వాటి మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకరికొకరు సహకరించుకుంటు ప్రజలను మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తాను బీజేపీపై పోరాటం చేస్తుంటే తనను ఎదుర్కొలేకనే అక్రమ కేసులు పెట్టి తన లోక్ సభ సభ్యత్వం కూడా రద్దు చేశారనీ అన్నారు.

తన లోక్ సభ సభ్యత్వం రద్దు చేసినా ప్రజల కోసం తాను పోరాటం ఆపే ప్రసక్తే లేదని అన్నారు.. దేశ బడ్జెట్ కేటాయింపులో ఐఏఎస్ లదే కీలక పాత్ర అని ... అలాంటి అధికారుల్లో 90శాతం అగ్రవర్ణాలకు చెందినవారే ఉన్నారని అన్నారు. అందుకే కులగణన చేస్తేనే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని, దీనిపై పార్లమెంటులో తాను ప్రశ్నిస్తే ప్రధాని మోడీ జవాబు చెప్పకుండా మౌనం వహించారని అన్నారు.
కులగణన జరిగితేనే బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతాయనీ, కానీ .కులగణన అటు మోడీకి. ఇటు కేసీఆర్ కు ఇష్టంలేదనీ, అందుకే కేంద్రంలో, రాష్ట్రంలో తాము అధికారంలోకి రాగానే కులగణన చేపడతామని స్పష్టం చేశారు.. దేశ సంపదను, పన్నుల రూపంలో వచ్చిన ప్రజల సొమ్మును మోదీ ఆదానీకి కట్టబెడుతున్నారని ఆరోపించారు.
సహజంగా అడవిలో సింహాలు ఒంటరిగా కనిపిస్తే, తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం చాలా పులులు కలిసికట్టుగా బీఆరెస్ తో పోరాడుతున్నాయనీ అంటూ తెలంగాణ కాంగ్రెస్ ను గబ్బర్ షేర్ ఆని కితాబిచ్చారు. ఇక తాము తెలంగాణ లో అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మూతపడ్డ చక్కెర కర్మాగారాలను పునఃప్రారంభించి రైతులను ఆదుకుంటామన్నారు.
పసుపు రైతును ఆదుకునేలా క్వింటా పసుపుకు 12వేల రూపాయలు మద్దతు ధర కల్పిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజలతో తనకున్నది రాజకీయ బంధం కాదని, కుటుంబ బంధం.ఆని చెప్పుకొచ్చారు. ఈ అనుబంధం ఈనాటిది కాదనీ, నెహ్రూ, ఇందిరమ్మ నుంచి వారసత్వ పరంపరగా కొనసాగుతోందనీ అన్నారు.












Click it and Unblock the Notifications