ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోనే.. ఎక్కడ ఎవరు గెలిచారంటే!!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాలు ఉంటే, అందులో పది స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిన సమయంలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ కేతనాన్ని ఎగురవేసింది.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో ఎవరు విజయం సాధించారు అన్న విషయానికి వస్తే, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా హాట్ సీట్స్ గా రెండు స్థానాలను అందరూ భావించారు. వరంగల్ తూర్పు, పాలకుర్తి నియోజకవర్గాలలో కొండా సురేఖ, ఎర్రబెల్లి దయాకర్ రావు పోటీ చేయడంతో, అక్కడ హోరాహోరీగా పోరు కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అందరి దృష్టి ఆ రెండు సీట్లపై కేంద్రీకృతమైంది.

అయితే పాలకుర్తి నియోజకవర్గం లో ఎర్రబెల్లి దయాకర్ రావును, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశస్విని రెడ్డి ఓటమిపాలు చేశారు. మరోవైపు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మూడవ స్థానానికి పడిపోగా, గట్టిగా పోటీ ఇచ్చిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు ను ఓడించి కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ వరంగల్ తూర్పు కోట పై జెండా ఎగరేశారు.

ఇక వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో వరుసగా నాలుగు సార్లు విజయం సాధించిన దాస్యం వినయ్ భాస్కర్ ను ఓడించి, నాయిని రాజేందర్ రెడ్డి విజయం సాధించారు. భూపాలపల్లి లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు, సమీప ప్రత్యర్థి బి ఆర్ ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని ఓడించి, భూపాలపల్లి లో కాంగ్రెస్ జెండా ఎగురవేశారు.

పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి, బిఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి పై విజయం సాధించారు. ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతక్క, ప్రత్యర్థి , బి ఆర్ ఎస్ నుండి బరిలోకి దిగిన నాగజ్యోతి పై విజయం సాధించారు. నర్సంపేట నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పై కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి విజయం సాధించారు.
డోర్నకల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ పై, కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్ర నాయక్ విజయం సాధించారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై కాంగ్రెస్ అభ్యర్థి మురళి నాయక్ విజయం సాధించారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పై, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కే ఆర్ నాగరాజు విజయం సాధించారు.
మొత్తం పది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగగా, స్టేషన్ ఘనపూర్, జనగామ నియోజకవర్గాలలో బిఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. ఈ రెండు స్థానాలు మినహాయించి మిగతా స్థానాలన్నీ కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు? -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications