Telangana elections: ఆమె తీర్పే ఫైనల్.. తెలంగాణాలో పాలకులను నిర్ణయించేది మహిళలే!!

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలలో మెజార్టీ ఓటు బ్యాంకు ఎవరిది? ఎవరు పాలకులను నిర్ణయించనున్నారు? అన్నది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే ఈసారి అధికారాన్ని కట్టబెట్టాలి అనే నిర్ణయాధికారం మహిళల చేతుల్లోనే ఉంది. ఈసారి ఎన్నికలలో మహిళా ఓటర్ల నిర్ణయమే ఫైనల్ గా మెజారిటీ నియోజకవర్గాలలో కనిపిస్తుంది.

ఈ ఎన్నికలలో అన్ని పార్టీల అభ్యర్థుల రాజకీయ భవితవ్యాన్ని తేల్చడం లో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల 26 లక్షల పై చిలుకు ఓటర్లు ఉన్నారు. వీరిలో ఒక కోటి 62 లక్షల పైచిలుకు ఓటర్లు పురుష ఓటర్లు కాగా, ఒక కోటి 63 లక్షల పై చిలుకు ఓటర్లు మహిళా ఓటర్లుగా ఉన్నారు.

Telangana elections: women voters decides the rulers of telangana

పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఈసారి రాజకీయాలను మహిళలు శాసించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 75 సెగ్మెంట్లలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. కేవలం 44 నియోజకవర్గాల్లో పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు. మేడ్చల్, మల్కాజ్ గిరి, హైదరాబాద్, కుమురం భీమ ఆసిఫాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తిలలో మాత్రమే పురుష ఓటర్లు ఫలితాలను శాసించే స్థాయిలో ఉన్నారు.

ఈ నియోజకవర్గాల్లో పురుష ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. జిల్లాల వారీగా 26 జిల్లాలలో మహిళలే ఎక్కువ సంఖ్యలో ఉండటం విశేషం.అంతేకాదు గ్రామీణ జిల్లాలలో కూడా మహిళల బలమే ఎక్కువ ఉండటంతో మహిళా ఓటర్ల తీర్పే కీలకం కానుంది. అయితే మహిళా ఓటర్లు ఏ పార్టీని ఆదరిస్తారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

తెలంగాణా రాష్ట్రంలో అధికారం కోసం పోటీ పడుతున్న మార్పు రావాలి అంటున్న కాంగ్రెస్ కు మద్దతు ఇస్తారా? లేదా అభివృద్ధి, సంక్షేమం పేరుతో ఆదరించాలని అడుగుతున్న బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చి ముచ్చటగా మూడో సారి పట్టం కడతారా? లేదా డబుల్ ఇంజన్ సర్కార్ ను ఆదరించాలని అడుగుతున్న బీజేపీకి మహిళలు పట్టం కడతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+