Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రైతుల మరణ మృదంగం.. చీమ కుట్టినట్టైనా లేదా సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్రంలో రైతుల మరణ మృదంగం కొనసాగుతుంది. నిన్నటికి నిన్న ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు కు చెందిన రైతు బోజడ్ల ప్రభాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక నేడు కారేపల్లి మండలం ఆలియా తండా గ్రామంలో మరో రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు.

పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన రైతు
చింతకాని మండలం పొద్దుటూరు గ్రామంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పొద్దుటూరు గ్రామ రెవెన్యూ పరిధిలో పాము చెరువుకు సమీపంలో ప్రభాకర్ ఆయన కుటుంబ సభ్యులకు 7.05 ఎకరాల భూమి ఉంది. ప్రభాకర్ తన భూమిలో చెరువు మట్టి పోయించుకున్నాడు. అయితే ప్రభాకర్ చెరువు మట్టి పోయించుకుని, సాగు చేస్తున్నాడని మత్స్య సంఘం సభ్యులు అభ్యంతరం తెలిపి ప్రొక్లెయిన్ లతో పెద్ద గుంతలు తవ్వి ప్రభాకర్ ను ఇబ్బందిపెట్టారు.

Telangana farmers suicides continuing harish rao targets revanth reddy govt

సెల్ఫీ వీడియో తీసి మరీ ఆత్మహత్య
తన పొలాన్ని కొందరు నాశనం చేశారని వారిపై ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించలేదని అందుకే తన పొలంలోని పురుగుల మందు తాగుతూ వీడియో తీసి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ప్రభాకర్ మృతితో పోలీసులు ఈ ఘటనకు కారణమైన పదిమంది పైన కేసు నమోదు చేశారు. నిన్న రైతు ప్రభాకర్ ఆత్మహత్య మర్చిపోకముందే మళ్లీ నేడు మరొక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

తన పొలాన్ని ఆక్రమించారని పురుగుల మందు తాగిన మరో రైతు
కారేపల్లి మండలం ఆలియా తండా గ్రామంలో తన భూమిని ఆక్రమించారని ఎవరికి చెప్పినా తనకు న్యాయం జరగలేదని ఆవేదన చెందిన భద్రయ్య అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు భద్రయ్యను ఇల్లందు ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఆయన పరిస్థితి విషమించడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో ఆ రైతును ఖమ్మం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాంగ్రెస్ సర్కార్ కు చీమ కుట్టునట్టు అయినా లేదు : హరీష్ రావు
రైతుల వరుస ఆత్మహత్యలతో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంది. తాజాగా ఆత్మహత్యల ఘటనలపై మాజే మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గం అని మండిపడ్డారు.

Telangana farmers suicides continuing harish rao targets revanth reddy govt

వరుస ఘటనలపై హరీష్ రావు ఆవేదన
ఖమ్మం జిల్లాలో మొన్న ఒక రైతు పురుగులమందు తాగి ప్రాణాలు వదిలితే, తన సమస్యకు పరిష్కారం చూపడం లేదనే ఆవేదనతో నిన్నసీఎం గారి సొంత జిల్లాలోనే ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు అంటూ సోషల్ మీడియా వేదికగా రైతుల ఆత్మహత్య ఘటనలపై మండిపడ్డారు. ఈ ఘటనలు మరువక ముందే నేడు ఖమ్మం జిల్లా ఆలియా తండాలో మరో రైతు పురుగులమందు తాగి ప్రాణాలు వదిలేందుకు సిద్ధమయ్యారని హరీష్ రావు పేర్కొన్నారు.

ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ, పట్టెడన్నం పెట్టే రైతులపై లేదు
రైతుల ఆత్మహత్యలు నివారించేందుకు, వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించకపోవడం బాధాకరం అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ, పట్టెడన్నం పెట్టే రైతుల సంక్షేమం పట్ల లేదన్నారు. పురుగుల మందే రైతన్నలకు పెరుగన్నం అయ్యే దుర్భర పరిస్థితులను ఏడు నెలల కాంగ్రెస్ పాలన మళ్లీ తీసుకువచ్చిందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని, రైతుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+