Telangana Formation Day 2021: యంగెస్ట్ స్టేట్‌కు ఏడేళ్లు: జాతీయ పతాక రెపరెపలు
హైదరాబాద్: తెలంగాణ.. దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించి ఇవ్వాళ్లితో ఏడేళ్లు పూర్తయ్యాయి. ఎనిమిదో ఏట అడుగు పెట్టింది. దశాబ్దాల పాటు సాగిన ఉద్యమాలు, బలిదానాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం కావడం వల్ల.. ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న సందర్భం ఇది. సాధారణంగా అత్యంత వైభవంగా సాగాల్సిన ఈ వేడుకలపై కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ప్రభావాన్ని చూపింది. కోవిడ్ ప్రొటోకాల్స్ మధ్య ఈ వేడుకలను నిర్వహించుకోవాల్సి వస్తోంది. దీనికి అనుగుణంగా- తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు ఈ ఉదయం నిరాడంబరంగా ఆరంభమయ్యాయి.
ఈ తెల్లవారు జామున శాసనమండలిలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శాసన మండలి ప్రాంగణంలో ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు. జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసిన నివాళి అర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి నర్సింహా చార్యులు, టీఆర్ఎస్ శాసన సభా పక్ష కార్యదర్శి రమేష్ రెడ్డి, అసెంబ్లీ, శాసన మండలి ఉద్యోగులు పాల్గొన్నారు. కోవిడ్ ప్రొటోకాల్స్ మధ్య ఈ కార్యక్రమం నిరాడంబరంగా నిర్వహించారు.

Recommended Video
హైదరాబాద్‌లో ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. దాదాపు అదే సమయానికి మంత్రులు జిల్లా కేంద్రాల్లో రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. కలెక్టర్లు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఇదివరకే ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిరాడంబరంగా, పరిమిత సంఖ్యలో ఆహ్వానితుల మధ్య నిర్వహించాల్సి ఉంటుందంటూ ప్రభుత్వం ఇదివరకే ఉత్తర్వులను జారీ చేసింది.












Click it and Unblock the Notifications