హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వెలిగిపోతున్నాం, ధనవంతులను చేస్తా: కెసిఆర్, బాబుకు హితవు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రానున్న నాలుగైదేళ్లలో మౌలిక సదుపాయాల కల్పన పూర్తిచేసి, ప్రతి పేద కుటుంబాన్ని ధనవంతులుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధిని సాధిస్తూ, తనను తాను నిర్మించుకుంటూ, భారతజాతి నిర్మాణంలో తనవంతు పాత్ర నిర్వహిస్తోందని పేర్కొన్నారు.

ప్రతి ఎన్నికల్లో ఘన విజయాలు అందించి ప్రజలు దీవిస్తున్నారని, ఆ ప్రజాబలంతోనే అజేయంగా పురోగమిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో బతుకులు బాగుపడుతాయని ప్రజల విశ్వసించారని, రెండేళ్ల తెరాస ప్రభుత్వ పాలన ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుందని చెప్పారు. ఇది మన ప్రభుత్వం అనే భావన ప్రతి తెలంగాణ పౌరుడిలో ఏర్పడిందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ద్వితీయ అవతరణ దినోత్సవం సందర్బంగా గురువారం ఉదయం పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, అనంతరం హెచ్‌ఐసీసీలో జరిగిన విశిష్ట సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. రాష్ట్రంలో పేదరికాన్ని తరిమికొడతామని ఉద్ఘాటించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బంగారు తెలంగాణ నిర్మాణానికి పునరంకితమవుతున్నామని ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్రం బాలారిష్టాలన్నీ అధిగమించి లక్ష్యం దిశగా వేగంగా సాగుతున్నదని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతి అద్భుతంగా ఉందని, 2020 నాటికి రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లకు, 2024 నాటికి రూ. 5 లక్షల కోట్లకు చేరుతుందని చెప్పారు. దుర్భర దారిద్య్రంలో ఉన్న పేద ప్రజలను ఆదుకునేందుకు ప్రథమదశలో సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిచ్చామని, అదే సమయంలో రాష్ట్ర పురోభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలపై భారీగా నిధులు వెచ్చించి పటిష్ఠ పునాదులు వేస్తున్నామని చెప్పారు.

గొడవలొద్దు: బాబుకు కెసిఆర్

రెండు తెలుగు రాష్ట్రాలు బాగుపడే విధంగా సామరస్యంతో ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చునని, ఇరు రాష్ట్రాల రైతులకు మేలు జరిగేట్టు చూడాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని అంటారనీ, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కర్నాటక, మహారాష్టత్రో జల వివాదాలు ఉండేవని కానీ ఇప్పుడు సామరస్య పూర్వకంగా చర్చించుకుని పరస్పరం సహకరించుకుంటున్నామని చెప్పారు.

ఇరుగు పొరుగు రాష్ట్రాలతో తెలంగాణ సత్సంబంధాలను కోరుకుంటోందని చెప్పారు. తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు మంచిది కాదన్నారు. విజ్ఞతతో వ్యవహరించి ఉభయ రాష్ట్రాల రైతులకు ప్రయోజనం కలిగే విధంగా నిర్ణయాలు తీసుకుందామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. కృష్ణా, గోదావరి నదులు రెండింటిలో 3858 టిఎంసిల నీరు అందుబాటులో ఉంటుందని చెప్పారు.

అన్ని రకాలుగా తెలంగాణ, ఆంధ్రాకు 4200 టిఎంసిల నీళ్లు అందుబాటులో ఉంటాయని, ఆ నీళ్లతో రెండు రాష్ట్రాల్లో నాలుగు కోట్ల ఎకరాలకు సాగునీరు అందించవచ్చునని ముఖ్యమంత్రి తెలిపారు. వివాదాలు వద్దు, సామరస్యంగా చర్చించుకుందామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సైతం చెప్పినట్టు తెలిపారు.

కెసిఆర్ విజన్ ఉన్న నాయకుడు

ముఖ్యమంత్రి కెసిఆర్ విజన్ ఉన్న నాయకుడని గవర్నర్ నరసింహన్ కితాబు ఇచ్చారు. ఎంతో సమర్ధవంతంగా పాలన సాగిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎలాంటి ఢోకా లేదని గవర్నర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ ఆషామాషి కార్యక్రమం కాదని, ప్రతి ఇంటికి మంచినీటిని అందించే అద్భుమైన పథకమని గవర్నర్ కొనియాడారు.

అమరవీరుల స్మారక నిర్మాణం

తెలంగాణ అమరవీరుల స్మారక నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మంగళవారం శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ భవనం ఎదురుగా తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం మాత్రమే ఉంది. కొత్తగా నిర్మించబోయే స్మారక నిర్మాణం అనేక హంగులు కలిగి ఉంటుంది.

ఆవిర్భావ వేడుక

ఆవిర్భావ వేడుక

రానున్న నాలుగైదేళ్లలో మౌలిక సదుపాయాల కల్పన పూర్తిచేసి, ప్రతి పేద కుటుంబాన్ని ధనవంతులుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

ఆవిర్భావ వేడుక

ఆవిర్భావ వేడుక

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధిని సాధిస్తూ, తనను తాను నిర్మించుకుంటూ, భారతజాతి నిర్మాణంలో తనవంతు పాత్ర నిర్వహిస్తోందని పేర్కొన్నారు.

ఆవిర్భావ వేడుక

ఆవిర్భావ వేడుక

ప్రతి ఎన్నికల్లో ఘన విజయాలు అందించి ప్రజలు దీవిస్తున్నారని, ఆ ప్రజాబలంతోనే అజేయంగా పురోగమిస్తున్నామని చెప్పారు.

ఆవిర్భావ వేడుక

ఆవిర్భావ వేడుక

తెలంగాణ రాష్ట్రంలో బతుకులు బాగుపడుతాయని ప్రజల విశ్వసించారని, రెండేళ్ల తెరాస ప్రభుత్వ పాలన ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుందని చెప్పారు. ఇది మన ప్రభుత్వం అనే భావన ప్రతి తెలంగాణ పౌరుడిలో ఏర్పడిందన్నారు.

ఆవిర్భావ వేడుక

ఆవిర్భావ వేడుక

తెలంగాణ రాష్ట్ర ద్వితీయ అవతరణ దినోత్సవం సందర్బంగా గురువారం ఉదయం పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, అనంతరం హెచ్‌ఐసీసీలో జరిగిన విశిష్ట సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.

ఆవిర్భావ వేడుక

ఆవిర్భావ వేడుక

రాష్ట్రంలో పేదరికాన్ని తరిమికొడతామని ఉద్ఘాటించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బంగారు తెలంగాణ నిర్మాణానికి పునరంకితమవుతున్నామని ప్రకటించారు.

ఆవిర్భావ వేడుక

ఆవిర్భావ వేడుక

2018 నాటికి కాళేశ్వరం, పాలమూరు, డిండి, సీతారామ ప్రాజెక్టులు పూర్తిచేసి సాగునీరు అందిస్తామని తెలిపారు. ఎవరు సహకరించినా సహకరించకపోయినా కృష్ణా, గోదావరి నదుల్లో చుక్కనీరుకూడా వదలకుండా తెలంగాణ వాటా సాధించి తీరుతామన్నారు.

ఆవిర్భావ వేడుక

ఆవిర్భావ వేడుక

తెలంగాణ రాష్ట్రం బాలారిష్టాలన్నీ అధిగమించి లక్ష్యం దిశగా వేగంగా సాగుతున్నదని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతి అద్భుతంగా ఉందని, 2020 నాటికి రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లకు, 2024 నాటికి రూ. 5 లక్షల కోట్లకు చేరుతుందని చెప్పారు.

ఆవిర్భావ వేడుక

ఆవిర్భావ వేడుక

దుర్భర దారిద్య్రంలో ఉన్న పేద ప్రజలను ఆదుకునేందుకు ప్రథమదశలో సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిచ్చామని, అదే సమయంలో రాష్ట్ర పురోభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలపై భారీగా నిధులు వెచ్చించి పటిష్ఠ పునాదులు వేస్తున్నామని చెప్పారు.

ఆవిర్భావ వేడుక

ఆవిర్భావ వేడుక

రాష్ట్రంలో కరెంటు కోతలు లేవని, 2018కల్లా మంచినీటి కొరత కూడా ఉండబోదని చెప్పారు.

ఆవిర్భావ వేడుక

ఆవిర్భావ వేడుక

2022 తరువాత కరువు రక్కసి తెలంగాణ వైపు చూడటానికే భయపడుతుందని, వర్షాలు కురిసినా, కురువకపోయినా తెలంగాణలో కరువు కాలుమోపదని అన్నారు. త్వరలోనే 15 లక్షల జనాభాకు ఒక జిల్లాను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఆవిర్భావ వేడుక

ఆవిర్భావ వేడుక

రెండు తెలుగు రాష్ట్రాలు బాగుపడే విధంగా సామరస్యంతో ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చునని, ఇరు రాష్ట్రాల రైతులకు మేలు జరిగేట్టు చూడాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.

ఆవిర్భావ వేడుక

ఆవిర్భావ వేడుక

నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని అంటారనీ, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కర్నాటక, మహారాష్టత్రో జల వివాదాలు ఉండేవని కానీ ఇప్పుడు సామరస్య పూర్వకంగా చర్చించుకుని పరస్పరం సహకరించుకుంటున్నామని చెప్పారు.

ఆవిర్భావ వేడుక

ఆవిర్భావ వేడుక

ఇరుగు పొరుగు రాష్ట్రాలతో తెలంగాణ సత్సంబంధాలను కోరుకుంటోందని చెప్పారు. తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు మంచిది కాదన్నారు.

ఆవిర్భావ వేడుక

ఆవిర్భావ వేడుక

విజ్ఞతతో వ్యవహరించి ఉభయ రాష్ట్రాల రైతులకు ప్రయోజనం కలిగే విధంగా నిర్ణయాలు తీసుకుందామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. కృష్ణా, గోదావరి నదులు రెండింటిలో 3858 టిఎంసిల నీరు అందుబాటులో ఉంటుందని చెప్పారు.

ఆవిర్భావ వేడుక

ఆవిర్భావ వేడుక

అన్ని రకాలుగా తెలంగాణ, ఆంధ్రాకు 4200 టిఎంసిల నీళ్లు అందుబాటులో ఉంటాయని, ఆ నీళ్లతో రెండు రాష్ట్రాల్లో నాలుగు కోట్ల ఎకరాలకు సాగునీరు అందించవచ్చునని ముఖ్యమంత్రి తెలిపారు.

ఆవిర్భావ వేడుక

ఆవిర్భావ వేడుక

వివాదాలు వద్దు, సామరస్యంగా చర్చించుకుందామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సైతం చెప్పినట్టు తెలిపారు.

ఆవిర్భావ వేడుక

ఆవిర్భావ వేడుక

జిల్లాకు 15 లక్షల జనాభా ఉండే విధంగా జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. జిల్లాల సంఖ్య ఎక్కువ ఉండి ఎక్కువ మందికి కలెక్టర్లు అందుబాటులో ఉంటారని అన్నారు.

ఆవిర్భావ వేడుక

ఆవిర్భావ వేడుక

జిల్లాలకు సంబంధించిన సమగ్ర సమాచారం జిల్లా కలెక్టర్ వద్ద ఉంటుందని, దీనివల్ల ఎవరికైనా ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్నా వారికి ఏ పథకం కింద మేలు చేయవచ్చునో జిల్లా కలెక్టర్ నిర్ణయించే అవకాశం ఉంటుందని చెప్పారు.

ఆవిర్భావ వేడుక

ఆవిర్భావ వేడుక

నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం సాగిందని కెసిఆర్ చెప్పారు. తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పాటు కావడంతో మన నిధులు మనమే వ్యయం చేసుకుంటున్నామని, నియామకాలు జరుగుతున్నాయని తెలిపారు.

ఆవిర్భావ వేడుక

ఆవిర్భావ వేడుక

నీటి సమస్య కూడా తీరుతుందని అన్నారు. తెలంగాణలో పేదరికంపై యుద్ధం ప్రకటించామని, పేదలు లేని తెలంగాణ కోసం కృషి చేస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.

ఆవిర్భావ వేడుక

ఆవిర్భావ వేడుక

తెలంగాణ ఆర్థిక వృద్ధిరేటు జాతీయ వృద్ధి రేటు కన్నా ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. 2019-20 సంవత్సరంలో తెలంగాణ బడ్జెట్ ఐదులక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని తెలిపారు.

ఆవిర్భావ వేడుక

ఆవిర్భావ వేడుక

తెలంగాణ అభివృద్ధి ఇదే విధంగా కొనసాగితే 2024 నాటికి తెలంగాణ బడ్జెట్ ఐదులక్షల కోట్లకు చేరుకుంటుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.

ఆవిర్భావ వేడుక

ఆవిర్భావ వేడుక

రెండేళ్లలో సాధించిన అభివృద్ధిని వివరించి, అభివృద్ధి కోసం మీ సలహాలు కోరాలని గవర్నర్ సూచించడంతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి తెలిపారు.

ఆవిర్భావ వేడుక

ఆవిర్భావ వేడుక

రాష్ట్ర అభివృద్ధి కోసం సలహాలు, సూచనలు తనకు పంపించ వచ్చునని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు బాగా పని చేశారని అన్నారు.

ఆవిర్భావ వేడుక

ఆవిర్భావ వేడుక

తెలంగాణ అమరవీరుల స్మారక నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మంగళవారం శంకుస్థాపన చేశారు.

English summary
On the occasion of Telangana formation day on Thursday, Chief Minister K. Chandrasekhar Rao sent out a message to his Andhra Pradesh counterpart N. Chandrababu Naidu stating that there was no point in quarrelling over sharing of river waters, and both states should utilise their share of waters as allocated by the tribunals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X