నాగార్జున సాగర్ లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసిన జెన్‌కో.. రీజన్ ఇదే !!
నాగార్జున సాగర్ జలవిద్యుత్ ఉత్పత్తిని తెలంగాణ జెన్‌కో నిలిపివేసింది. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ లో జెన్‌కో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యుత్ ఉత్పత్తిని ఆపివేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చోటు చేసుకున్న జల వివాదాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం అక్రమంగా విద్యుత్ ఉత్పత్తిని చేస్తుందని, దానిని నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు, కేంద్రానికి లేఖలు రాసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతామని తేల్చిచెప్పింది. ఈ మేరకు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి మరీ విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తుంది.
అయితే సడన్ గా జెన్‌కో ఉన్నతాధికారుల ఆదేశాలతో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయడంపై ఆసక్తి నెలకొంది.గత నెల 29వ తేదీ నుంచి నాగార్జునసాగర్ లో జల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నారు. గత 11 రోజులుగా సాగుతున్న విద్యుత్ ఉత్పత్తిలో మొత్తం 30 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేశారు. అయితే నాగార్జున సాగర్ కు వరద నీరు రావడం నిలిచిపోవడంతో, సాగర్ లో నీటి మట్టం తక్కువగా ఉండటంతో విద్యుదుత్పత్తిని నిలిపివేయవలసిందిగా అధికారులు ఆదేశాలిచ్చారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తి సాయి నీటి మట్టం 590 అడుగులకు గాను, ప్రస్తుతం సాగర్ లో 529.20 అడుగుల నీటిమట్టం ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో ఏమి రావడం లేదు. సాగర్ జలాశయం పూర్తి స్థాయి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 166.5892 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్ నుండి 18,246 క్యూసెక్కుల నీరు ప్రస్తుతం బయటకు వెళుతుంది. ప్రాజెక్టుల్లో నీళ్లు తక్కువగా ఉన్నప్పటికీ తెలంగాణ జల విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని కృష్ణా బోర్డుకు ఏపీ ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. విద్యుత్ ఉత్పత్తితో సహా, కృష్ణా జలాల కేటాయింపుపై ఈనెల 24వ తేదీన కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ సమావేశం నిర్వహించి చర్చించనుంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications