నిమజ్జనానికి అధికారిక సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Recommended Video
గణేష్ నిమజ్జనం సందర్భంగా గురువారం హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 14న రెండో శనివారం ఈ జిల్లాల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు పనిదినంగా ప్రకటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మరోవైపు నిమజ్జనంపై ఎలాంటి రూమర్స్ క్రియేట్ చేయొద్దని.. డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. రూమర్స్ సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ముఖ్యఘట్టం అన్నారు. అన్ని శాఖలను కలుపుకుని కార్యక్రమాన్ని ప్రశాంతంగా ముగించేందుకు కృషి చేస్తామన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనం సాగిందని తెలిపారు.

గణేష్ నిమజ్జనం సందర్భంగా గ్రేటర్‌తో కలుపుకుని 50 శివారు ప్రాంతాల్లో రేపు 50 వేల వినాయకుల నిమజ్జనం జరుగుతుందన్నారు. నిమజ్జనం జరిగే అన్ని చోట్లా సీసీటీవీ పర్యవేక్షణ ఉంటుందన్నారు. సపోలీసులు నిమజ్జనానికి పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఉదయం నుండి రాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ప్రకటించారు.ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ప్రయాణికులు ప్రత్యామ్నాయా మార్గాలను చూసుకోవాలని పోలీసులు సూచించారు.












Click it and Unblock the Notifications