కోమటిరెడ్డి, సంపత్ కుమార్‌ల శాసన సభ్యత్వాలు రద్దు: గెజిట్ నోటిఫికేషన్ జారీ
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి వెంకట రెడ్డి,సంపత్ కుమార్‌ల శాసన సభ్యత్వాలు రద్దు చేస్తున్నట్లు మంగళవారం రాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ అసెంబ్లీలో రెండు స్థానాలు ఖాళీ అయినట్లు ఈ నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఈ మేరకు ఎన్నికల సంఘానికి తెలంగాణ అసెంబ్లీ సమాచారం కూడా ఇచ్చింది. బడ్జెట్ సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగం సమయంలో కోమటిరెడ్డి, సంపత్‌లు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
మంగళవారం శాసన సభలో ఇద్దరు సభ్యుల శాసన సభ్యత్వాలను రద్దు చేస్తూ, మిగతా 11 మందిని సభ నుంచి ఈ సెషన్స్ వరకు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దానికి కొనసాగింపుగా రాత్రి గెజిట్ విడుదలైంది.












Click it and Unblock the Notifications