మందుబాబులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..!
తెలంగాణలో మందుబాబులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్న తెలంగాణలో మద్యం షాపుల్ని అర్ధరాత్రి వరకూ తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 31న నిర్వహించే కొత్త సంవత్సల వేడుకల సందర్భంగా మద్యం అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మద్యం షాపులతో పాటు బార్లు, రెస్టారెంట్లు కూడా అర్ధరాత్రి వరకూ తెరిచి ఉంచనున్నారు.
తెలంగాణలో కొత్త సంవత్సర వేడుకల్ని ధూంధాంగా జరుపుకునేందుకు మందుబాబులు సిద్దమవుతున్నారు. వీరికి ఎక్సైజ్ శాఖ శుభవార్త అందించింది. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకూ మద్యం షాపుల్ని తెరిచే ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బార్లు, రెస్టారెంట్లు రాత్రి ఒంటిగంట దాకా వ్యాపారం చేసుకోవచ్చని తెలిపింది. ఈమేరకు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలు, ఈవెంట్లకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహించే స్పెషల్ ఈవెంట్లకు పలు షరతులతో అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే పార్టీలు, పబ్ లలో డ్రగ్స్ వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు షరతు పెట్టింది. డిసెంబర్ 31 రాత్రి నిర్వహించే ఈవెంట్లలో డ్రగ్స్ వినియోగించకుండా చూడాలని అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చింది.
డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకూ వైన్ షాపులు తెరిచి ఉంచేందుకు అనుమతినివ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏడాది పొడవునా జరిగే వ్యాపారంలో మూడో, నాలుగో వంతు వ్యాపారం కొత్త ఏడాది సందర్భంగా జరుగుతుందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications