హైదరాబాద్‌లో రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు.. ఇంకా ఎవరంటే ??

తెలంగాణ లోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు ప్రవేశపెట్టింది. హైదరాబాద్ నగరంలోని కీలక రోడ్లకు ప్రముఖ వ్యక్తులు.. సంస్థల పేర్లు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రభావితవ్యక్తులు, ప్రముఖ కంపెనీల పేర్లను రహదారులకు పెట్టడం ద్వారా వారికి సముచిత గౌరవం ఇవ్వటంతో పాటు, హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. ఆ రోడ్లపై ప్రయాణించే వారికి కూడా స్ఫూర్తివంతంగా ఉంటుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదన చేశారు.

అవుటర్ రింగ్ రోడ్డు వద్ద రావిర్యాల నుంచి ఫ్యూచర్ సిటీ వరకు వంద మీటర్ల గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు రతన్ టాటా పేరు పెట్టాలని నిర్ణయించింది. కాగా ఇప్పటికే రావిర్యాల ఇంటర్‌ ఛేంజ్‌కు టాటా ఇంటర్‌చేంజ్ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ప్రపంచంలోనే తొలిసారిగా ఓ రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ ముందు నుంచే వెళ్లే ప్రధాన రహదారికి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని పేరు పెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది.

telangana-government-proposal-about-tata-and-trump-other-names-for-prominent-places

ఈ మేరకు తుది నిర్ణయం కోసం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు, అమెరికా రాయబార కార్యాలయానికి ప్రభుత్వం లేఖలు రాయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నిర్ణయంతో పాటు మరికొన్ని కీలక రహదారులకు కూడా ప్రముఖుల, సంస్థల పేర్లను ఖరారు చేశారు. మరోవైపు ఐటీ కారిడార్‌లో ముఖ్యమైన రోడ్లకు గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

అయితే గత నెలలో ఢిల్లీలో జరిగిన యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరమ్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని ముఖ్యమైన రోడ్లకు ప్రపంచస్థాయి కార్పొరేషన్ల పేర్లు పెడతామని ప్రకటించారు. దానికి అనుగుణంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు సోమవారం నుంచి హైదరాబాద్ సమీపంలో జరగనున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'కు ముందు ఈ ప్రకటనలు వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+