తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్: 2.73 శాతం డీఏ మంజూరు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగులకు ఒక డీఏ(2.73శాతం) మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి పింఛన్‌తో కలిపి ఫిబ్రవరిలో పింఛన్ దారులకు డీఏ చెల్లించనుంది.
2021 జులై నుంచి 2022 డిసెంబర్ నెలాఖరు వరకు 8 విడతల్లో డీఏ బకాయిలను జీపీఎఫ్‌లో జమ చేయనున్నట్లు ఉత్తర్వులు ప్రభుత్వం పేర్కొంది. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం(డీఏ) 2.73 శాతం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త..!
— Harish Rao Thanneeru (@trsharish) January 23, 2023
సీఎం కేసీఆర్ గారు నిర్ణయం మేరకు, ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనర్లకు కరువు భత్యం (DA/DR) 2.73% పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 17.29 శాతాన్ని, 20.02 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 1/2 pic.twitter.com/hZfp10gipA
ఉద్యోగులు, పెన్షనర్ల డీఏను 17.29 నుంచి 20.02 శాతానికి పెంచినట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. డీఏ పెంపుతో 4.40 లక్షల మంది ఉద్యోగులు, 2.88 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతారని తెలిపారు.

టీచర్ల పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ విడుదల
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ సోమవారం విడుదలైంది. జనవరి 27వ తేదీ నుంచి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. జనవరి 28 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
మార్చి 4 నాటికి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ముగియనుంది. ఈ ప్రక్రియ మొత్తం 37 రోజుల్లో ముగియనుంది. మార్చి 5 నుంచి 19వ తేదీ వరకు అప్పీళ్లకు అవకాశం కల్పించనున్నారు. టీచర్ల నుంచి దరఖాస్తులు అందిన 15 రోజుల్లో అప్పీళ్లను పరిష్కరించనున్నారు.












Click it and Unblock the Notifications