డేరా సచ్చా సౌదా గుర్మీత్ రామ్ రహీం సింగ్‌కు తెలంగాణ ప్రభుత్వం షాక్!
నల్గొండ జిల్లాలో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ గతంలో కొనుగోలు చేసిన తొమ్మిది ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
హైదరాబాద్: నల్గొండ జిల్లాలో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ గతంలో కొనుగోలు చేసిన తొమ్మిది ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

ఫిర్యాదులు రావడంతో
ఈ భూమి అసైన్డ్ లాండ్ అని నిర్ధారణ కావడం, చుట్టుపక్కల రైతుల నుంచి ఫిర్యాదులు రావడంతో చిట్టాల మండలం ఎలిమినేడులో 65వ జాతీయ రహదారిపై ఉన్న భూమిని స్వాధీనం చేసుకున్నట్టు తహసీల్దార్ వెల్లడించారు.

చుట్టుపక్కల రైతులు ఇబ్బంది
ఈ భూముల చుట్టూ 10 అడుగుల గోడ కట్టడం వల్ల చుట్టుపక్కల పొలాలు ఉన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు, కాల్వ నీరు పోకుండా అడ్డంగా ప్రహరీ నిర్మించడంతో పంట పొలాలు మునిగిపోతున్నాయని స్థానిక రైతులు వాపోతున్నారు.

అసైన్డ్ భూమి
నల్గొండ జిల్లాలో 2008 నుంచి 2015 మధ్య రూ.30 కోట్ల విలువైన 55 ఎకరాల భూమిని గుర్మీత్ కొనుగోలు చేశాడు. ఈ భూమి ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్‌లు పురుషోత్తమ్ లాల్, కిషన్ సేవాధార పేరిట ఉంది. ఇందులో 9 ఎకరాల అసైన్డ్ భూమి కూడా గుర్మీత్ ట్రస్ట్ పేరిట ఉందని తెలుసుకున్న రెవెన్యూ శాఖ, నోటీసులు పంపింది.

సేవా కార్యక్రమాలు అని చెబుతున్నప్పటికీ..
ఈ భూమిని కొనుగోలు చేసి, సేవా కార్యక్రమాల నిమిత్తం ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయన వర్గం చెబుతున్నా, ఒక్కసారి కూడా గుర్మీత్ ఇక్కడికి రాలేదు. పంచాయతీకి బోరును అద్దెకు ఇచ్చి నెలకు రూ.5వేలు వసూలు చేస్తున్నారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications