హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలివితేటలు ఉన్నా, అలా మారలేకపోతున్నాం: కెటిఆర్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సరికొత్త ఆలోచనలున్న వారిదే ఇప్పుడు పైచేయి అని, మంచి యోచనలతో వచ్చి పారిశ్రామికాధిపతులుగా వెలగాలని మహిళలకు తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం పిలుపునిచ్చారు.

ఫేస్‌బుక్‌ ఇండియా.. ఔత్సాహిక మహిళల కోసం ఏర్పాటు చేసిన 'బూస్ట్‌ యువర్‌ బిజినెస్‌' కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. టి హబ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 500మంది ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఅర్ మాట్లాడారు.

ఐటీ సేవల్లో మనల్ని మనం అగ్రగామిగా చెప్పుకొంటున్నామని, తెలివితేటలు మెండుగా ఉన్నా పెట్టుబడిదారులుగా మాత్రం మారలేకపోతున్నామని, ఆ దిశగా ఆలోచిస్తే భవిష్యత్తు మనదేనని కెటిఆర్ అన్నారు. వినూత్న ఆలోచనలకే ఇప్పుడు పెద్దపీట అన్నారు.

ఫేస్‌బుక్ 'బూస్ట్‌ యువర్‌ బిజినెస్'

ఫేస్‌బుక్ 'బూస్ట్‌ యువర్‌ బిజినెస్'

గురువారం గచ్చిబౌలిలోని టీ హబ్‌లో జరిగిన ఫేస్‌బుక్ మహిళా పారిశ్రామికవేత్తల కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఫేస్‌బుక్ 'బూస్ట్‌ యువర్‌ బిజినెస్'

ఫేస్‌బుక్ 'బూస్ట్‌ యువర్‌ బిజినెస్'

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారాలనుకునేవారికి తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టి హబ్‌ ద్వారా చేయూత అందిస్తున్నామని, తమ ప్రయత్నానికి మొదట్లోనే చక్కని స్పందన లభించిందన్నారు.

ఫేస్‌బుక్ 'బూస్ట్‌ యువర్‌ బిజినెస్'

ఫేస్‌బుక్ 'బూస్ట్‌ యువర్‌ బిజినెస్'

మహిళలుగా మీకెన్నో కొత్త ఆలోచనలుంటాయని, కానీ ఎక్కడికెళ్ళాలో తెలియకపోవచ్చునని, అలాంటివారి కోసం ఫేస్‌బుక్‌ సంస్థ సదస్సు నిర్వహించటం మెచ్చుకోదగ్గ విషయమన్నారు.

ఫేస్‌బుక్ 'బూస్ట్‌ యువర్‌ బిజినెస్'

ఫేస్‌బుక్ 'బూస్ట్‌ యువర్‌ బిజినెస్'

మీ (మహిళలు) ఆలోచనలకు ఓ రూపం వస్తుందని, ప్రభుత్వం నుంచీ సహకారం ఉంటుందని కెటిఆర్ చెప్పారు. మహిళలకు ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, మీరు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కోరుకుంటున్నామన్నారు. కాగా, త్వరలోనే నాలుగు ఐటీ కొత్త పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

ఫేస్‌బుక్ 'బూస్ట్‌ యువర్‌ బిజినెస్'

ఫేస్‌బుక్ 'బూస్ట్‌ యువర్‌ బిజినెస్'

మహిళా పారిశ్రామికవేత్తలకు పరిశ్రమలలో ప్రత్యేక కోటా ఇస్తామని కెటిఆర్ చెప్పారు. వారికి పరిశ్రమల ఏర్పాటుకోసం అదనపు ప్రోత్సాహకాలు కూడా అందజేస్తామన్నారు.

ఫేస్‌బుక్ 'బూస్ట్‌ యువర్‌ బిజినెస్'

ఫేస్‌బుక్ 'బూస్ట్‌ యువర్‌ బిజినెస్'

ఫేస్‌బుక్‌వారి సోషియో బిజినెస్ క్యాంపెయిన్‌కు సంబంధించి హైదరాబాద్ నగరానికి చెందిన 200మంది ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

English summary
Telangana Government to Open 4 New IT Parks, Says KT Rama Rao
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X