భారీగా ఐపీఎస్‌ల బదిలీ: డీజీపీగా రవిగుప్తా కొనసాగింపు, ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. 20 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీగా రవిగుప్తాకి పూర్తి బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. రోడ్డు భద్రతా విభాగం ఛైర్మన్‌గా అంజనీకుమార్‌ను నియమించారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా ఆయనకు బాధ్యతలు అప్పగించారు.
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా రాజీవ్ రతన్, ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్, రాష్ట్ర పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా అభిలాష బిస్త్, జైళ్లశాఖ డీజీగా సౌమ్య మిశ్రా, సీఐడీ డీఐజీగా రమేష్ నాయుడు, సీఏఆర్ హెడ్ క్వార్టర్ట్స్ సంయుక్త కమిషనర్‌గా సత్యనారాయణ, సెంట్రల్ జోన్ డీసీపీగా శరత్ చంద్ర పవార్ నియమితులయ్యారు.

ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా కమలాసన్ రెడ్డి, టీసీపీఎఫ్ అదనపు డీజీగా అనిల్ కుమార్, హోంగార్డ్స్ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర, హైదరాబాద్ మల్టీ జోన్ ఐజీ-2గా తరుణ్ జోషి, హైదరాబాద్ మల్టీజోన్-1 ఐజీగా జోషికి అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఏసీబీ డైరెక్టర్‌గా ఏఆర్ శ్రీనివాస్, ఐజీ పర్సనల్ గా చంద్రశేఖర్ రెడ్డి, సీఐడీ అదనపు డీజీగా శిఖా గోయల్ నియమితులయ్యారు. శిఖా గోయల్ కు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
పలువుర ఐఏఎస్‌లకు పదోన్నతులు
తెలంగాణలో 14 మంది ఐఏఎస్‌లకు పదోన్నతులు కల్పించింది. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేల్ ఐఏఎస్‌లు పదోన్నతి కల్పించింది. ఈ పదోన్నతులు 2024 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రమోషన్ పొందినవారిలో.. రమేలా సత్పతి, అనురాగ్ జయంతి, గౌతమ్ పాత్రు, రాహుల్ రాజ్, భావేష్ మిశ్రా, సత్య శారదాదేవి, నారాయణ రెడ్డి, ఎస్ హరీశ్, జీ రవి, కే నిఖిల, అయేషా మష్రత్ ఖానమ్, సంగీత సత్యనారాయణ, యాసీన్ బాషా, వెంకట్రావ్ ఉన్నారు.












Click it and Unblock the Notifications