‘గేమ్ ఛేంజర్’కు భారీ షాక్! టికెట్ ధరల పెంపు రద్దు, బెనిఫిట్ షోలు కూడా

హీరో రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' (Game Changer)కు షాక్ తగిలింది. ఈ సినిమా టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. టికెట్ ధరల పెంపు విషయంలో సినిమాకు ఇచ్చిన వెసులుబాటును ఉపసంహరించుకున్నట్లు ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

హైకోర్టు ఆదేశాల మేరకు 'గేమ్ ఛేంజర్' టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో ఇక నుంచి తెల్లవారుజామున స్పెషల్ షోలకు అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా సినిమాల స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వబోమని ఉత్తర్వుల్లో తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది.

Telangana government withdraws order to increase ticket prices for the movie Game Changer

'గేమ్ ఛేంజర్' చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం మొదట అనుమతి ఇచ్చింది. సినిమా విడుదలైన శుక్రవారం రోజున ఉదయం 4 గంటల నుంచి 6 షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అలాగే, సినిమా విడుదల రోజు సింగిల్ స్క్రీన్స్‌లో అదనంగా రూ. 100, మల్టీప్లెక్సుల్లో రూ. 150 పెంచుకునేందుకు, నవరి 11 నుంచి 19 వరకు 5 షోలకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 50, మల్టీప్లెక్సుల్లో రూ. 100 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. యితే, తాజాగా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గేమ్ ఛేంజర్' శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. కాగా, మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటి రోజు భారీగా వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా సుమారు రూ.186 కోట్లు వసుళ్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ ఓ స్పెషల్ పోస్టర్​ ద్వారా వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+