ఖైరతాబాద్ పంచముఖ రుద్ర మహా గణపతికి గవర్నర్ తమిళిసై తొలిపూజ: తరలివచ్చిన భక్తులు
హైదరాబాద్: నగరంలోని ప్రఖ్యాత ఖైరతాబాద్ పంచముఖ రుద్ర మహా గణపతికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దంపతులు శుక్రవారం తొలి పూజ నిర్వహించారు. గణనాథుడికి బంగారు కంకణాన్ని గవర్నర్ సమర్పించారు. అనంతరం గవర్నర్‌ను కమిటీ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, తదితరులు పాల్గొన్నారు.
మహా గణపతి స్వామివారికి 60 అడుగుల కండువా, జంధ్యం, గరికమాలను భారీ ఊరేగింపుగా తీసుకొచ్చి సమర్పించారు. ఈ ఏడాది పంచముఖ రుద్ర మహా గణపతిగా ఖైరతాబాద్ గణేష్ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. 40 అడుగుల హైదరాబాద్ గణేష్‌కు కుడిమైపున కాల నాగేశ్వరీ, ఎడమవైపు కృష్ణకాళీ అమ్మవారు ఉన్నారు. వినాయక చవితి తొలి రోజున వేలాది భక్తులు తరలివచ్చి మహా గణనాథుడిని దర్శించుకున్నారు. దీంతో ఖైరతాబాద్‌లో సందడి నెలకొంది.

ఖైరతాబాద్‌కు మట్టి విగ్రహాన్ని పంపిన సీఎం కేసీఆర్
ఎన్నో ప్రత్యేకతలున్న ఐదడుగుల ఓ మట్టి వినాయక ప్రతిమను ఖైరతాబాద్ మహా గణనాథుని మండపానికి పంపించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ విగ్రహానికి పూజలు నిర్వహించాలంటూ సీఎం కేసీఆర్ భక్తులను కోరారు. ఎకో ఫ్రెండ్లీగా పండుగను నిర్వహించుకోవాలనే సందేశాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అందించారు ముఖ్యమంత్రి కేసీఆర్.
దేశంలోనూ, రాష్ట్రంలోనూ వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇళ్లు, దేవాలయాలు, మండపాల్లో కొలువుదీరిన గణనాథులు భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు. మరోవైపు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి కరోనా నిబంధనలను పాటించాలని ప్రభుత్వాలు, కోర్టులు ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. కరోనా నిబంధనలు పాటిస్తూనే భక్తులు తమ ఇష్టదైవమైన వినాయక చవితి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.

ఈ ఏడాది సిటీ నుంచే ఖైరతాబాద్ గణేశుడికి లడ్డూ
వినాయక చవితి ఉత్సవాలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుంచి గాక, ఇతర రాష్ట్రాల భక్తులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఖైరతాబాద్ వినాయకుడు నేటి ఉదయం నుంచి పూజలందుకుంటున్నాడు. ఎంతో ప్రత్యేకంగా కలిగివున్న ఖైరతాబాద్ గణేశున్ని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. ప్రతి ఏడాది ఒక్కో రూపంలో దర్శనమిస్తుంటారు ఖైరతాబాద్ గణేశుడు. ఈసారి పంచముఖ రుద్ర మహాగణపతిగా భక్తులకు దర్శనిమిస్తున్నాడు. కాగా, ఈ భారీ గణనాథుడి కోసం అంతే స్థాయిలో భారీ లడ్డూను చేయిస్తారు నిర్వాహకులు. ఇలాంటి లడ్డూ ప్రసాదం కోసం భక్తులు వేల సంఖ్యలో పోటీపడుతుంటారు. గత 12ఏళ్లుగా తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి ఖైరతాబాద్ గణపతి కోసం లడ్డూను తీసుకొస్తారు. అయితే.. ఈ సంప్రదాయానికి ఈ ఏడాదితో బ్రేక్ పడనుంది. ఈ ఏడాది నుంచి భారీ లంబోదరుడి లడ్డూను స్థానికంగానే తయారు చేయించారు.
ఈ ఏడాది హైదరాబాద్‌వాసీల నుంచి 2000 కేజీల లడ్డును తయారు చేయించారు. ఈ ఏడాది వినాయకస్వామి ఎలక్ట్రికల్ అండ్ ఎయిర్ కూలర్స్ యజమాని శ్రీకాంత్ నుంచి 1100 కేజీల లడ్డును లంబోదరుడి కోసం సిద్ధం చేశారు. భక్తాంజనేయ స్వీట్ నుంచి 900 కేజీల లడ్డును స్వామివారి సమర్పించనున్నారు. కాగా, స్వామివారికి సమర్పించేందుకు తయారు చేసిన మహా ప్రసాదం లడ్డును ప్రత్యేక వాహనాల్లో ఖైరతాబాద్‌కు తీసుకువస్తారు. తీసుకువచ్చిన తర్వాత స్వామివారి ముందు ప్రత్యేక స్థలంలో ఈ లడ్డును పెట్టి స్వామివారికి సమర్పించనున్నారు. అనంతరం భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు.
కాగా, తాపేశ్వరానికి చెందిన 'సురుచి ఫుడ్స్' అధినేత మల్లిబాబు.. 2010 నుంచి ఖైరతాబాద్ గణపతి కోసం భారీ లడ్డూను నైవేద్యంగా పంపుతున్నారు. ఈ లడ్డూ పలుమార్లు గిన్నిస్ బుక్‌లోనూ చోటు దక్కించుకుంది. గణపతి నిమజ్జనం తర్వాత మల్లిబాబు తాను సమర్పించిన లడ్డూలో కొంత భాగాన్ని ప్రసాదంగా తీసుకునేవారు. మిగతా లడ్డూను నిర్వాహకులు భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టేవారు.
మరోవైపు, గణేష్ ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్య రానుండటంతో ట్రాఫిక్ పోలీసులు పలు చోట్ల మళ్లింపు చర్యలు చేపట్టారు. భక్తులు సొంత వాహనాల్లో రాకుండా మెట్రో, ఎంఎంటీఎస్లలో రావాలని సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. ఖైరతాబాద్ ప్రధాని రహదారిలో రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి రైల్వే గేటు మీదుగా విగ్రహం వైపు వాహనాలకు అనుమతించడం లేదు. ఐమాక్స్, మింట్ కాంపౌండ్ మీదుగా ప్రభుత్వ ముద్రణాలయం వైపు వాహనాలకు కూడా అనుమతి లేదు. లక్డీకపూల్‌లోని రాజ్‌దూత్ మార్గంలో వచ్చే వాహనాలు వార్డు కార్యాలయం లేదంటే మార్కెట్ వైపు మళ్లీస్తారు. నెక్లెస్ రోడ్ రోటరీ మీదుగా దర్శనం కోసం వచ్చే వారి వాహనాలు ఐమ్యాక్స్ సమీపంలో హెచ్ఎండీఏ పార్కులో పార్కింగ్ చేసుకోవాలి. వృద్ధులు, నడవలేనివారు ఉంటే అలాంటివారి ఫోర్ వీలర్స్‌ను మింట్ కాంపౌండ్‌లో పార్కింగ్ చేసుకునేందుకు అనుమతిస్తారు. టూ వీలర్స్ ఎప్పటిలాగా మింట్ కాంపౌండ్ రోడ్డు, ఐమ్యాక్స్ ముందున్న హెచ్ఎండీఏ పార్కింగ్ స్థలంలో నిలపవచ్చు. ఖైరతాబాద్ ప్రధాన రహదారి గుండా వచ్చే వాహనదారులు ఆ మార్గంలో పలు భవనాల పార్కింగ్ ప్రదేశాల్లో అనుమతి ఇచ్చామని వాటిని వినియోగించుకోవచ్చని పోలీసులు సూచించారు. ఇక ఖైరతాబాద్ కు మెట్రోలో వచ్చే భక్తులు ఐసీఐసీఐ బ్యాంకు వైపు నుంచి మాత్రమే కిందకు దిగాలి. మెట్రో సిబ్బంది ఈ విషయంలో సూచనలు చేస్తారని తెలిపారు.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications