ఉస్మానియా ఆస్పత్రిలో దారుణ పరిస్థితిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవేదన
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలో రోగులకు సరైన వసతులు లేవని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఆమె సోమవారం ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ శశికళ గవర్నర్‌కు స్వాగతం పలికారు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రి పరిసరాలను, పాత భవనాన్ని పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు గవర్నర్ తమిళిసై.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉస్మానియా ఆస్పత్రి విషయంలో చొరవ చూపిన కోర్టును అభినందిస్తున్నట్లు చెప్పారు. ఆస్పత్రిలోని టాయిలెట్లు పరిశీలించానని.. పరిస్థితి దారుణంగా ఉందన్నారు. రోజుకు 2వేల మంది ఔట్ పేషెంట్లు వస్తున్నారు. ఆస్పత్రి పైకప్పు పెచ్చులు ఊడి రోగులు బాధపడుతున్నారన్నారు. రోజుకు 200 వరకు సర్జరీలు చేస్తున్నారని చెప్పారు.

ఉస్మానియా ఆస్పత్రి భవనం కట్టి వందల ఏళ్లు అవుతోందని గవర్నర్ తెలిపారు. జనరల్ వార్డులో కొన్ని ఫ్యాన్లు మాత్రమే పని చేస్తున్నాయన్నారు. ఎండ వేడి తట్టుకోలేకపోతున్నామని రోగులు వాపోతున్నట్లు తెలిపారు. కొత్త భవనం కట్టాల్సిన అవసరం ఉందన్నారు. తాను ఎవరినీ తప్పుబట్టేందుకు ఉస్మానియా ఆస్పత్రికి రాలేదని స్పష్టం చేశారు. ఆస్పత్రి పరిస్థితులపై ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నానన్నారు.
ఉస్మానియా ఆస్పత్రిలో సిబ్బంది, రోగులతో గవర్నర్ మాట్లాడారు. కాగా,
ఇటీవల ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణం చేపట్టాలని గవర్నర్ ట్విట్టర్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి సంబంధించి గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలుపుకోవాలంటూ 'జస్టిస్ ఫర్ ఓజీహెచ్' చేసిన ట్వీట్‌ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రీట్వీట్ చేశారు. ఆస్పత్రి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఎంతో మందికి అత్యంత మెరుగైన వైద్య సేవలు అందించిన చరిత్ర ఉస్మానియా ఆస్పత్రికి ఉందని తెలిపారు గవర్నర్. ఆస్పత్రి నూతన భవన నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని త్వరగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉస్యానియా దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, గవర్నర్ వ్యాఖ్యలపై ఇటీవల మంత్రి హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఉస్మానియా ఆస్పత్రి సందర్శన ప్రాధాన్యత సంతరించుకుంది. తాను మంత్రి విమర్శలను పట్టించుకోనని.. ప్రజలకు మంచి జరగాలనేది తన ఉద్దేశమని స్పష్టం చేశారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications