Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హెచ్‌సీఏ భూములపై క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కారు

Kancha Gachibowli: HCA భూముల వివాదంపై ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. అబద్ధాల మీదే బతుకుతున్న కొన్ని రాజకీయ పార్టీలు కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో అడ్డగోలుగా వ్యవహరిస్తూ దుష్ప్రచారం చేస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.

ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను వెనక్కి తెచ్చుకోవాలని.. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదన్నారు. హెచ్‌సీయూ నుంచి భూములను లాక్కొని రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏో వెంచర్లు, ప్లాట్లు వేసి అమ్ముకునేందుకు ప్రయత్నిస్తోందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Telangana Govt announcement on HCU lands

జనవరి 13, 2024 వరకు ఈ 400 ఎకరాలు హెచ్‌సీయూ పరిధిలోనే ఉందని వర్సిటీ భావిస్తోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఈ 400 ఎకరాలను వర్సిటీ నుంచి తీసుకొని ఓ ప్రైవేటు సంస్థకు కేటాయించారు. ఆ 400 ఎకరాలను బదలాయింపుగా వర్సిటీకి ఆనుకుని మరోవైపు 397 ఎకరాలు వర్సిటీకి కేటాయించారని, దానికి సంబంధించి ఆనాడు రెవెన్యూ అధికారులు, వర్సిటీ యాజమాన్యం కలిసి సంతకం చేసిన రికార్డులు ప్రభుత్వం వద్ద ఉన్నాయని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు.

రాష్ట్ర ప్రజలు, వర్సిటీ విద్యార్థులకు ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రికార్డులకు సంబంధించిన పత్రాలను మీడియాకు అందిస్తామన్నారు. ఈ అంశంలో కొన్ని రాజకీయ పార్టీలు కావాలనే దుష్ప్రచారం చేస్తూ ప్రజలు, విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని భట్టి విక్రమార్క మండిపడ్డారు. బదలాయింపులో భూమి దక్కించుకున్న వర్సిటీ బాగుందని, మరి ఓ ఫ్రాడ్ సంస్థకు కేటాయించిన ఆ 400 ఎకరాలు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అదంతా ప్రజల ఆస్తి అని అన్నారు. ప్రజలకే దక్కాలని ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.

నవంబర్ 21, 2006లో వైయస్సార్ నాయకత్వంలో ప్రైవేటు సంస్థకు ఇచ్చిన భూముల కేటాయింపును రద్దు చేసిందన్నారు. తమకు ఇప్పటికే గత ప్రభుత్వం రాసిఇచ్చింది.. ఇప్పుడు మీకు రద్దు చేస్తే ఎలా అని ఆ సంస్థ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. ఇది ప్రజల ఆస్తి అని.. ప్రజలకే ఉండాలని నిర్ణయంతో ఆనాటి నుంచి పోరాడుతూ వస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిందని.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడూ ఆ భూములను వెనక్కి తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేయలేదన్నారు.

ప్రభుత్వ భూములే

తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ. వేల కోట్ల విలువైన భూమి ప్రభుత్వానికే చెందేలా పోరాటం చేయాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామన్నారు. హైకోర్టులో కొట్లాడి కేసు గెలిచామన్నారు. ఆ తర్వాతే టీజీఐఐసీ అధికారిక ప్రకటన విడుద చేసిందన్నారు. ఇది అభినందించాల్సిన విషయమని డిప్యటీ సీఎం తెలిపారు. ఈ 400 ఎకరాలు కాపాడి.. అక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు లభించేలా ఒక కార్యాచరణ రూపొందించి ముందుకెళ్తామన్నారు.

మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరిక

మరో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. హెచ్‌సీయూ(HCU)కి సంబంధించిన ఆస్తి, ఒక అంగుళం భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదని చెప్పారు. ఈ విషయంలో కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలతో అనుసంధానంగా ఉన్న సంఘాలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వర్సిటీ భూమి వర్సిటీకే ఉందని స్పష్టం చేశార. ప్రభుత్వ పనికి అడ్డుతగిలితే ఉపేక్షించేది లేదని మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరించారు. పార్టీల ప్రలోభాలకు విద్యార్థులు గురికావదన్నారు.

హైచ్‌సీయూ భూ అంశంపై రాద్ధాంతం చేస్తోన్నవారికి హైరైజ్ బిల్డింగ్‌లకు అనుమతి ఇచ్చేటప్పుడు పర్యావరణం గుర్తుకురాలేదా? అని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. ఈ భూముల్లోని జంతువులు, పక్షులకు ఎలాంటి హాని జరగలేదన్నారు. జంతువులు చనిపోయినట్లు సోషల్ మీడియాలో చూపుతున్న చిత్రాలు పాతవని చెప్పారు. మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు హెచ్ సీయూ పూర్వ విద్యార్థులేనని తెలిపారు. బండరాళ్లు, చెరువులకు ఎలాంటి నష్టం జరగనివ్వమని అన్నారు. బీఆర్ఎస్ వ్యక్తులు వి
ద్యార్థుల ముసుగులో అరాచకం చేస్తున్నారని పొంగులేటి మండిపడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+