తెలంగాణలో బీఈ/బీటెక్ విద్యార్థులకు భారీ ఊరట- నోటిఫికేషన్‌కు ఆమోదం
తెలంగాణలో ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రభుత్వం భారీ ఊరట ఇచ్చింది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ప్రొఫెషనల్ విద్యాసంస్థల్లో అందించే అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కోర్సుల ఫీజులను నిర్ధారించింది. ఉన్నత విద్యా రంగానికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుండి 2027-28 వరకు అంటే వచ్చే మూడు సంవత్సరాల బ్లాక్ పీరియడ్‌కు సంబంధించి ఈ ఫీజులు ఖరారు అయ్యాయి.
తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (TAFRC) ఈ ఫీజుల నిర్ధారణలో కీలక పాత్ర పోషించింది. గత ఏడాది అక్టోబర్ 29న జరిగిన కమిటీ సమావేశంలో బీఈ/బీటెక్ కోర్సుల ఫీజు నిర్మాణానికి సిఫార్సులు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. ఇందులో ట్యూషన్ ఫీజు మాత్రమే ఉంటుందని, ప్రత్యేక ఫీజులు లేదా ప్రవేశ రుసుములు చేర్చలేదని స్పష్టం చేశారు. ఈ సిఫార్సులను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ నోటిఫికేషన్‌కు ఆమోదం లభించింది.

2011 నాటి అన్‌ఎయిడెడ్ నాన్ మైనారిటీ/మైనారిటీ ప్రొఫెషనల్ విద్యా సంస్థల నిబంధనల్లోని రూల్ 9, అలాగే తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ నిబంధనల్లోని రూల్ 4, సబ్-రూల్ (5) అనుగుణంగా తాజా నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. దీంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ప్రొఫెషనల్ విద్యా సంస్థలకు ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగా, విద్యాసంస్థలు వార్షిక ట్యూషన్ ఫీజును ప్రతి సంవత్సరం ముందుగానే వసూలు చేసుకోవాల్సిన ఉంటుంది.
విద్యార్థుల సౌలభ్యం మేరకు సంస్థలు ఒకే మొత్తం (Lumpsum) రూపంలో గానీ, లేదా వాయిదాల పద్ధతిలో గానీ ఫీజును స్వీకరించే వెసులుబాటును కల్పించవచ్చు. కమిటీ నిర్ధారించిన ఫీజులకు అదనంగా క్యాపిటేషన్ ఫీజులు, ఇతర రూపాల్లో (ఉదాహరణకు విరాళాలు) అనధికారికంగా లేదా అక్రమంగా వసూలు చేయవద్దని హెచ్చరించింది.
ఇలాంటి వసూళ్లు క్యాపిటేషన్ ఫీజు పరిధిలోకి వస్తాయి. ఫీజుల ద్వారా వచ్చే లాభాన్ని విద్యా సంస్థల ప్రయోజనాలకే వినియోగించాలి తప్ప, ఇతర ఉద్దేశ్యాలకు లేదా వ్యక్తిగత లాభాల కోసం మళ్లించకూడదు. కమిటీ ద్వారా ఫీజుల నిర్మాణం నిర్ణయించినంత మాత్రాన, కోర్సులు నిర్వహించడానికి అనుమతి లభించినట్లు కాదు. విద్యాసంస్థలు తప్పనిసరిగా ప్రభుత్వం, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (AICTE), ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) లేదా సంబంధిత విశ్వవిద్యాలయాల నుండి సరైన గుర్తింపు, అనుమతులు కలిగి ఉండాలి.
ఇవి లేకుండా ఏ ఒక్క కోర్సునూ నడపడానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2025-28 బ్లాక్ పీరియడ్‌కు టీఏఎఫ్ఆర్సీ సిఫార్సు చేసిన ఫీజులు, సంస్థలు ఆన్‌లైన్‌లో సమర్పించిన డేటాపై ఆధారపడి ఉన్నాయి. ఈ డేటా తనిఖీలకు లోబడి ఉంటుంది. సమర్పించిన సమాచారం తప్పు అని తేలితే, ఫీజులు సవరించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. చట్టపరమైన చర్యల కోసం సంబంధిత విశ్వవిద్యాలయాలు, ఏఐసీటీఈ వంటి సంస్థలకు సిఫారసు చేస్తుంది కూడా.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications