హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిఖత్ జరీన్, ఇషా సింగ్‌లకు కేసీఆర్ సర్కారు భారీ నజరానా, మొగిలయ్యకూ అదే రోజు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అంతర్జాతీయ క్రీడల్లో అద్భుత విజయాలను నమోదు చేసి భారతదేశం తోపాటు తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన నిఖత్ జరీన్, ఇషాసింగ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఇద్దరికీ రెండు కోట్ల రూపాయల చొప్పున నగదు బహుమతితో పాటు ఇంటిస్థలాన్ని కూడా ఇవ్వనుంది.

ఇటీవల టర్కీలో జరిగిన అంతర్జాతీయ మహిళా బాక్సింగ్ పోటీల్లో నిఖత్ జరీన్ స్వర్ణపతకం సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు, జర్మనీలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ పోటీల్లో ఇషా సింగ్ స్వర్ణపతకం సాధించింది.గొప్ప విజయాలు సాధించిన తెలంగాణ బిడ్డలను సమున్నతంగా గౌరవించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.

Telangana govt announces Rs 2 crore for Nikhat Zareen and Isha Singh, 1 crore for kinnera metla mogulaiah

జరీన్, ఇషాకు ఒక్కొక్కరికి రెండు కోట్ల నగదు బహుమతి ఇవ్వాలన్న సీఎం కేసీఆర్
ఆదేశాల మేరకు ప్రభుత్వం సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది. నగదు బహుమతితో పాటు బంజారాహిల్స్ లేదా జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో నివాసయోగ్యమైన ఇంటి స్థలాన్ని కేటాయించేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయించింది.

కాగా, జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా జరీన్, ఇషా సింగ్‌లకు ముఖ్యమంత్రి కేసీఆర్ చెక్కులు అందించనున్నారు. మరోవైపు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెరమెట్ల మొగిలయ్యకు గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన కోటి రూపాయల నగదు పురస్కారానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొగిలయ్యకు కూడా జూన్ 2నే నగదు తోపాటు మొగిలయ్య కోరుకున్న విధంగా బీఎన్ రెడ్డి నగర్ కాలనీలో నివాసయోగ్యమైన ఇంటి స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

English summary
Telangana government announces Rs 2 crore for Nikhat Zareen and Isha Singh, one crore for kinnerametla mogilaiah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X