అంగన్వాడీలకు తెలంగాణా ప్రభుత్వం శుభవార్త!
మార్చి నెలలోనే ఎండలు మండుతున్నాయి. వేసవి ప్రారంభంతో ప్రజలు 10గంటలు దాటితే రోడ్లమీదకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఇక ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ కేంద్రాలలో ఒంటిపూట తరగతులను అమలు చేయాలని నిర్ణయించింది. ఎండల తీవ్రత, చిన్నారుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వులలో పేర్కొంది.
అంగన్వాడీలకు వేసవిలో ఒంటిపూట స్కూల్స్, సెలవులు
ఏప్రిల్ 23వ తేదీ వరకు అంగన్వాడి కేంద్రాలు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి. ఆ తర్వాత అంగన్వాడీలకు కూడా నెలరోజులపాటు వేసవి సెలవులు ప్రకటించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. గత సంవత్సరం అంగన్వాడీ లలో ఈ ఒంటిపూట బడుల విధానాన్ని అమలు చేయగా, ఈ సంవత్సరం కూడా అదే విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తుంది.

టేక్ హోమ్ రేషన్ ద్వారా పోషకాహారం
సమయాలు మారినప్పటికీ, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు టేక్ హోమ్ రేషన్ ద్వారా పోషకాహారం పంపిణీ చేయడానికి ఎటువంటి అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం. అంగన్వాడీల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారాన్ని ఇవ్వడానికి సంకల్పించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా అనేక కార్యక్రమాలను చేపడుతున్నాయి.
సక్షమ్ అంగన్వాడి కేంద్రాలుగా తెలంగాణాలో 5 వేలకు పైగా అంగన్వాడీలు
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని 5008 అంగన్వాడీ కేంద్రాలను సక్షమ్ అంగన్వాడి కేంద్రాలుగా ఆధునీకరించడానికి నిర్ణయం తీసుకుందని ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ అప్గ్రేడేషన్ కోసం కేంద్రం 30.04 కోట్లను కేటాయించిందని కిషన్ రెడ్డి తెలిపారు.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ భవనాలలో ఉన్న అంగన్వాడీల బలోపేతం
ఆధునీకరించబడే ఈ సక్షమ్ అంగన్వాడి కేంద్రాలు, సాధారణ కేంద్రాల కంటే మెరుగైన మౌలిక సదుపాయాలను కలిగి ఉంటాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మిషన్ సక్షమ్ అంగన్ వాడి, పోషణ్ 2.0 పథకాల కింద దేశవ్యాప్తంగా ప్రభుత్వ భవనాలలో ఉన్న దాదాపు రెండు లక్షల అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయనుంది.
ఆధునీకరించిన అంగన్వాడీలలో సదుపాయాలిలా
దీని ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చిన వారికి మెరుగైన పోషణతో పాటు, బాలల సంరక్షణకు, వారికి విద్యను అందించడానికి కృషి చేస్తారు. ఆధునీకరించబడిన 'సక్షమ్ అంగన్‌వాడీ కేంద్రాలు led స్క్రీన్ లతో, వాటర్ ఫిల్టర్లు, పోషక వనాలు, బాల్యదశ విద్యా సామాగ్రి వంటి వాటితో ఉంటాయి. ఇక్కడ సప్లమెంటరీ పోషకాహార కార్యక్రమంలో, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహార మద్దతును అందిస్తారు.
అంగన్వాడీలను మరింత ముందుకు తీసుకెళ్ళే పనిలో కేంద్రం
సిఫార్సు చేసిన ఆహార పరిమాణం, రోజువారి సగటు ఆహార పరిమాణం మధ్య ఉన్న లోపాలను సరి చేయడం చేస్తారు. కేంద్రం అంగన్వాడీలను మరింత ముందుకు తీసుకువెళ్లే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
-
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications